SCATSAT-1 | SCATSAT-1 | Sakshi
Sakshi News home page

SCATSAT-1

Published Sun, Oct 2 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

SCATSAT-1

SCATSAT-1

ఇస్రో.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబరు 26న ఉదయం పీఎస్‌ఎల్‌వీ-సీ35 రాకెట్‌ను విజయవంతగా ప్రయోగించింది.

ఇస్రో.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబరు 26న ఉదయం పీఎస్‌ఎల్‌వీ-సీ35 రాకెట్‌ను విజయవంతగా ప్రయోగించింది. దీనిద్వారా భారత్‌కు చెందిన స్కాట్‌శాట్-1, ప్రథమ్, పైశాట్ ఉపగ్రహాలను, అదేవిధంగా అల్జీరియాకు చెందిన మూడు అల్‌శాట్ ఉపగ్రహాలను, అమెరికాకు చెందిన పాత్‌ఫైండర్, కెనడాకు చెందిన ఎన్‌ఎల్‌ఎస్-19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. ఒకే రాకెట్‌తో రెండు భిన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రోకు ఇదే మొదటిసారి.
 
 దీంతోపాటు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రయోగాన్ని అత్యధిక సమయం (2 గంటల 15 ని.లు) నిర్వహించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ35ను ప్రయోగించిన తర్వాత దాదాపు 1058 సెకన్లకు, 729 కి.మీ. ఎత్తులో ధ్రువ సూర్యానువర్తిత (ౌ్క్చట ఠ డఛిజిటౌౌఠట) కక్ష్యలోకి స్కాట్‌శాట్ -1ని ప్రవేశపెట్టింది. అనంతరం ఉదయం 11.25 గంటలకు ప్రథమ్, పైశాట్ ఉపగ్రహాలను, 5 విదేశీ ఉపగ్రహాలను 689 కి.మీ. ధ్రువ కక్ష్యలోకి    ప్రవేశపెట్టింది.
 
 స్కాట్‌శాట్-1 ఎంతో కీలకం
  పీఎస్‌ఎల్‌వీ-సీ35 ద్వారా ఇస్రో మొత్తం 8 ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిలో 3 దేశీయ ఉపగ్రహాలు, 5 విదేశీ ఉపగ్రహాలు. దేశీయ ఉపగ్రహాల్లో ప్రధానమైందిస్కాట్‌శాట్ -1. దీని బరువు 371 కిలోలు. ఇది అత్యాధునిక వాతావరణ ఉపగ్రహం. వాతావరణ పరిశీలనకు, తుపానుల గుర్తింపు,  వాటి గమనానికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది.
 
  2009, సెప్టెంబరు 23న పీఎస్‌ఎల్‌వీ-సీ14 ద్వారా ఇస్రో ప్రయోగించిన ఓషన్‌శాట్-2 ఉపగ్రహంలోని స్కాటెరోమీటర్ పరికరానికి కొనసాగింపుగా స్కాట్‌శాట్-1ని ప్రయోగించింది. స్కాట్‌శాట్-1లో కేయూ బ్యాండ్ స్కానింగ్ స్కాటెరోమీటర్ రాడార్ అనే పరికరం ఉంది. ఇది 13.515 గిగాహెర్‌‌ట్జ తరంగ దైర్ఘ్యంలో రాడార్ సూత్రంపై పనిచేస్తుంది. ఈ పరికరం నుంచి విడుదలయ్యే శక్తి తరంగాలు సముద్ర ఉపరితలాన్ని తాకి, తిరిగి ప్రతిధ్వనిలా పరావర్తనం చెందినప్పుడు కీలక సమాచారాన్ని సేకరిస్తుంది.
 
  స్కాటెరోమీటరు నుంచి విడుదలయ్యే విద్యుత్ అయస్కాంత తరంగాలు, సముద్ర అలల మధ్య జరిగే అంతర చర్యలు ఈ ఉపగ్రహ విధిలో కీలకమైనవి. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర ఉపరితలాల గాలుల అధ్యయనానికి స్కాట్‌శాట్-1 ఉపకరిస్తుంది. తుపానుల గమనం, హిమాలయాల్లో హిమ నిర్మాణం-తరుగుదల, మరీ ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్ హిమం తరుగుదల, తుపాను తీరందాటే కచ్చిత సమయాన్ని అంచనా వేయడానికి స్కాట్‌శాట్-1 ఉపయోగపడుతుంది. దీని సమాచా రాన్ని ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఉపయోగించుకుం టాయి. ఇస్రో ఓషన్‌శాట్-3ను  ప్రయోగించేంత వరకు స్కాట్‌శాట్-1 కీలకంగా వ్యవహరిస్తుంది. దీని జీవిత కాలం 5 ఏళ్లు.
 
 ప్రథమ్
 ఇది ఐఐటీ బాంబే అభివృద్ధి చేసిన ఉపగ్రహం. దీని బరువు 10 కిలోలు. వాతావరణంలోని ఐౌౌటఞజ్ఛిట్ఛ భాగాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించింది. ప్రధానంగా ఐనోస్ఫియర్‌లోని ఎలక్ట్రాన్లను  అధ్యయనం చేస్తుంది. స్టూడెంట్ శాటిలైట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐఐటీ-బాంబే దీన్ని అభివృద్ధి చేసింది.
 
 పైశాట్
 బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు అభివృద్ధి చేసిన నానో ఉపగ్రహమే ఈ పైశాట్. దీని బరువు 5 కిలోలు. పైశాట్ ప్రాజెక్టు 2012లో ప్రారంభమైంది. 2014లో పూర్తయింది. ఇది 80ఝ రిజల్యూషన్‌తో భూమి ఉపరితలాన్ని చిత్రీకరిస్తుంది.
 
 విదేశీ ఉపగ్రహాలు
 పీఎస్‌ఎల్‌వీ-సీ 35 ద్వారా 3 అల్‌శాట్ ఉపగ్రహాల (అట్చ్ట  1ూ, అట్చ్ట  ఆ, అట్చ్ట 2ఆ)తో పాటు అమెరికాకు చెందిన పాత్‌ఫైండర్-1, కెనడాకు చెందిన ఎన్‌ఎల్‌ఎస్-19 ఉపగ్రహాలను ప్రయోగించారు. దీంతో ఇస్రో పీఎస్‌ఎల్‌వీ ద్వారా 21 దేశాలకు చెందిన 79 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించినటై్లంది. భవిష్యత్‌లో మరిన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించే దిశగా పీఎస్‌ఎల్‌వీ మార్కెటింగ్‌పై ఇస్రో వాణిజ్య విభాగం ఆంత్రిక్స్   కార్పొరేషన్ దృష్టి
 సారించింది.
 
  పీఎస్‌ఎల్‌వీ
 ఇస్రో ఇప్పటి వరకు 37 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను నిర్వహించగా, అందులో 36 వరుసగా విజయవంతమయ్యాయి. దీంతో ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అతి కొద్ది రాకెట్లలో ఒకటిగా పీఎస్‌ఎల్‌వీ గుర్తింపు పొందింది. ఇస్రో ఒకే రాకెట్ ద్వారా రెండు భిన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టి, రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో మరో మైలురాయిని అధిగమించింది.
 
 : హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీ బ్యూటడైన్
  అన్‌సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్+25% హైడ్రజైన్ హైడ్రేట్
  నైట్రోజన్ టెట్రాక్సైడ్
  మోనో మిథైల్ హైడ్రజైన్
  మిక్స్‌డ్ ఆక్సైడ్‌‌స ఆఫ్ నైట్రోజన్
 
 ఇటీవలి కాలంలో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు..

 సి.హరికృష్ణ
 
 సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ
 ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement