పెచ్చుమీరుతున్న టీడీపీ అరాచకాలు | tdp attacks high | Sakshi
Sakshi News home page

పెచ్చుమీరుతున్న టీడీపీ అరాచకాలు

Dec 24 2016 11:19 PM | Updated on Oct 16 2018 6:01 PM

పెచ్చుమీరుతున్న టీడీపీ అరాచకాలు - Sakshi

పెచ్చుమీరుతున్న టీడీపీ అరాచకాలు

అధికారంలోకొచ్చిన రెండున్నరేళ్లలో టీడీపీ అరాచకాలు పెరిగిపోయాయని, ముస్లిం సంఘాల నాయకులు మండిపడ్డారు.

అనంతపురం న్యూటౌన్‌ : అధికారంలోకొచ్చిన రెండున్నరేళ్లలో టీడీపీ అరాచకాలు పెరిగిపోయాయని, ముస్లిం సంఘాల నాయకులు మండిపడ్డారు. ముస్లిం మహిళపై దౌర్జన్యం చేయడం అన్యాయమని మంత్రి రావెల దిష్టిబొమ్మను   దహనం  చేశారు. శనివారం స్థానిక సప్తగిరి సర్కిల్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులు దాదాగాంధీ, ఐఎంఎం అధ్యక్షుడు మహబూబ్‌ బాషా, జనబలం నేత బాబా ఫకృద్దీన్, ఎంఎండీఏ అధ్యక్షుడు ఇమామ్, ఖాజీ ఇబ్రహీం తదితరులు మాట్లాడారు.

టీడీపీ పాలనంలో ముస్లిం మైనార్టీలకు తీవ్రంగా అవమానం జరుగుతోందన్నారు. మైనార్టీ శాఖను ముస్లింలతో భర్తీ చేయాలని ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలకే కట్టబెట్టడం  సరికాదన్నారు. ముస్లింలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెపుతామన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు జావేద్, జిలాన్, అయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement