నిద్రిస్తున్న తండ్రిపై కొడుకు గొడ్డలితో దాడి చేయడంతో... తీవ్రంగా గాయపడిన తండ్రి.. చికిత్స పొందుతూ మరణించాడు.
నల్లగొండ : నిద్రిస్తున్న తండ్రిపై కొడుకు గొడ్డలితో దాడి చేయడంతో... తీవ్రంగా గాయపడిన తండ్రి.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేట గ్రామ పంచాయతి పరిధిలోని దేన్యాతండలో శనివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన రమావత్ రాముల (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ నెల 19 వ్యవసాయ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి నిద్రిస్తున్న సమయంలో.. కొడుకు నరేష్(26) గొడ్డలితో తలపై బలంగా కొట్టాడు. దీంతో.. తలకు తీవ్ర గాయమైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. రాములు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.