వరహాల గెడ్డపై మున్సిపల్ కౌన్సిల్ చేపట్టిన వర్క్ రద్దు | Sakshi
Sakshi News home page

వరహాల గెడ్డపై మున్సిపల్ కౌన్సిల్ చేపట్టిన వర్క్ రద్దు

Published Tue, Nov 29 2016 3:59 AM

వరహాల గెడ్డపై మున్సిపల్ కౌన్సిల్ చేపట్టిన వర్క్ రద్దు - Sakshi

‘సాక్షి’ ఇవ్వండంటూ... కథనం చదివి వినిపించిన కలెక్టర్
 ఒకే పనికి రెండు టెండర్లపై చర్యలు తీసుకోవాలని కోరిన వైఎస్సార్‌సీపీ

పార్వతీపురం : పట్టణ మెరుున్‌రోడ్డులో ఉన్న వరహాల గెడ్డపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఇటు ఇరిగేషన్, అటు మున్సిపాల్టీ రెండు టెండర్లు పిలిచి దాదాపు రూ.40 లక్షలు దోపిడీకి సమాయత్తం అవుతున్నాయని.. కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కోరారు. దీనికి సంబంధించిన వివరాలను చూపించారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్.. ఇరిగేషన్ ఎస్‌ఈ రమణమూర్తి, మున్సిపాల్టీ అధికారులను పిలిచి వర్క్ క్యాన్సిల్ చేయాలని ఆదేశించారు.

అలాగే అక్రమంగా ఇసుకను డంప్ చేసిన ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని కోరగా.. ఈ మేరకు ఆర్డీఓకు కలెక్టర్ సూచించారు. ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంత్రి రవి, కౌన్సిలర్లు ఎస్.శ్రీనివాసరావు, చీకటి అనూరాధ, గొల్లు వెంకటరావు, రామారావు, శ్రీదేవి, రణభేరి శివకుమార్ పాల్గొని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

‘సాక్షి’ కథనంపై స్పందించిన కలెక్టర్
‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన ‘ఒక పనికి... రెండు టెండర్లు’ కథనాన్ని కలెక్టర్‌కు వైఎస్సార్ సీపీ నాయకులు చూపించారు. దీనిపై కలెక్టర్ వివేక్‌యాదవ్ స్పందిస్తూ.. ఆ కథనం చదివానని చెప్పారు. మరలా ‘సాక్షి’ పత్రిక ఇవ్వండంటూ...ఆ కథనంతోపాటు, ’ఇసుకాసురులను అరెస్ట్ చేయాలి’ అనే వార్తా కథనాన్ని చదివి వినిపించారు. సంబంధిత అధికారులను పిలిచి వెంటనే వరహాల గెడ్డపై ఇరిగేషన్ శాఖ ఖరారు చేసిన టెండర్‌ను ఉంచి, మున్సిపాల్టీ వేసిన టెండర్ వర్క్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. ఎలా అనుమతులిస్తారంటూ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లను సైతం కలెక్టర్ మందలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement