ప్రాణం తీసిన సరదా | pranam teesina sarada | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సరదా

Mar 14 2017 11:57 PM | Updated on Sep 17 2018 8:02 PM

ప్రాణం తీసిన సరదా - Sakshi

ప్రాణం తీసిన సరదా

స్నానానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మృతి చెందిన ఘటన చింతలపూడి మండలంలో చోటుచేసుకుంది.

చింతలపూడి: స్నానానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మృతి చెందిన ఘటన చింతలపూడి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక సుబ్బ రాజు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పసుపులేటి సుధాకర్, ఆకుల సుభాష్, కోలగట్ల మధు మురళీ అనే విద్యార్థులు ఒంటి పూట బడులు కావడంతో పాఠశాల ముగిసిన తర్వాత మధ్యాహ్న వేళ స్నేహితులతో కలిసి ఏడు కిలోమీటర్ల దూరంలోని విష్ణుసాగర్‌ చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. సాయంత్రమైనా వీరు ముగ్గురూ తిరిగి రాకపోవడంతో తల్లితండ్రులు చెరువు వద్ద వెతకగా విద్యార్థుల దుస్తులు, పాదరక్షలు చెట్టు కింద కనిపించాయి. స్నానానికి దిగి చెరువులో గల్లంతైనట్టు అనుమా నించి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. తహసీల్దార్‌ టి.మైఖేల్‌రాజు ఆధ్వర్యంలో ఫ్లడ్‌లైట్లు, జనరేట ర్‌తో గాలించగా రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement