హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు | badminton games in gowdanakunta | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు

Jan 17 2017 11:16 PM | Updated on Sep 5 2017 1:26 AM

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు

మండల పరిధిలోని గౌడనకుంట జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు మంగళవారం హోరాహోరీగా సాగాయి.

అమరాపురం : మండల పరిధిలోని గౌడనకుంట జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు మంగళవారం హోరాహోరీగా సాగాయి. ఉదయం పెనుకొండ, అనంతపురం జట్లు తలపడగా అనంతపురం విజయం సాధించింది. అలాగే వీహెచ్‌ఎస్, కాలేజీ జట్లు తలపడగా వీహెచ్‌ఎస్‌ జట్టు విజయం సాధించింది. దేవగానపల్లి, ఉపాధ్యాయుల జట్టు తలపడగా దేవగానపల్లి విజయం సాధించింది.

అలాగే అమరాపురం, జీడీఎస్‌ జట్టు ఆడగా జీడీఎస్‌ విజయం సాధించింది. అనంతపురం– బీ, బండమీదపల్లి జట్లలో బండమీదపల్లి విజయం సాధించింది. పోటీలు చూసేందుకు మండలం నుంచే కాక కర్ణాటక ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన క్రీడాకారులకు నిర్వాహకులు హనుంతరాయుడు, రాఘవేంద్ర, సిద్ధేశ్వర, శ్రీనివాసమూర్తి, రజీనీకుమార్, ఈరన్న అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సెమీ,ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement