శ్రీమఠం గోశాలలో మరో 3 గోవులు మృతి | another three cows died in shree matham | Sakshi
Sakshi News home page

శ్రీమఠం గోశాలలో మరో 3 గోవులు మృతి

Oct 23 2016 9:35 PM | Updated on Sep 4 2017 6:06 PM

శ్రీమఠం గోశాలలో మరో 3 గోవులు మృతి

శ్రీమఠం గోశాలలో మరో 3 గోవులు మృతి

శ్రీరాఘవేంద్రస్వామి మఠం గోశాలలో గోవుల మృత్యువాత ఆగడం లేదు.

మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం గోశాలలో గోవుల మృత్యువాత ఆగడం లేదు. గోశాలలో దోమల బెడద కారణంగా థ్రిప్స్‌ వ్యాధి(మెదడువాపు) సోకి ఆవులు చనిపోతున్న విషయం విదితమే. ఆదివారం మరో మూడు ఆవులు  చనిపోయాయి. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు  వాటిని ఎద్దుల బండిపై టార్పాలిన్‌ కప్పుకుని  తీసుకెళ్లి గోశాల çసమీపంలోని ఫిల్టర్‌బెడ్‌ వెనకభాగంలో పాతిపెట్టారు. శ్రీమఠం అధికారుల నిర్లక్ష్యంతో ఆవులను మృత్యువు వెంటాడుతూనే ఉంది. గోశాల నిర్వహణ లోపంతో దోమల నియంత్రణ సాధ్యపడటం లేదు. స్వచ్ఛ అభియాన్‌ చేపట్టినా మరణాలు అదుపులోకి రావడం లేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement