లండన్లో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం | YSRCP office launched in London | Sakshi
Sakshi News home page

లండన్లో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం

Mar 16 2014 11:37 PM | Updated on May 29 2018 2:59 PM

లండన్లో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం - Sakshi

లండన్లో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం

బ్రిటన్ రాజధాని లండన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ సీపీ యూకే, యూరప్ విభాగం మార్చి 15న పార్టీ ఆఫీసును ఆరంభించింది.

లండన్: బ్రిటన్ రాజధాని లండన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ సీపీ యూకే, యూరప్ విభాగం మార్చి 15న పార్టీ ఆఫీసును ఆరంభించింది.   ఈ సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే, యూరప్ విభాగం అధ్యక్షుడు వంగల సందీప్ రెడ్డి మాట్లాడుతూ "వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి మూడు సంవత్సరాలైంది. ఈ మూడేళ్లలో మనం తిరుగులేని విజయాలను సొంతం  చేసుకున్నాం. ఎన్నో ఆటుపొట్లను కూడా ఎదుర్కొన్నాం. జన నాయకుడయిన జగనన్నను ఎన్నికల ప్రచారం మధ్యలొ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా జైలుకు పంపించింది. తాము ఎన్నికలలో గెలవలేమని భయంతో కాంగ్రెస్ మన పార్టీని మొగ్గలోనే తుంచేయాలని కుట్రలు కుతంత్రాలు పన్నింది. ఈ అన్యాయనికి వ్యతిరేకంగా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఉప ఎన్నికలలొ తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఢిల్లీ దొరల అహంకారానికి మధ్య పోరాటం జరగుతోంది'' అని అన్నారు.    
 
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్ర బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ మీద ఈగ వాలకుండా చేస్తొంటే,  తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పొరాడుతోన్నది ఒక్క జగనన్న మాత్రమేనని అన్నారు. జగనన్నని ముఖ్య మంత్రిని చేయడంతో పాటు వైఎస్ఆర్ సీపీకి 25 పైచిలుకు ఎంపి  సీట్లు ఇచ్చి ఢిల్లీలో తెలుగువారి సత్తాచాటాలని  సందీప్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు వారు దేశ పరిపాలనను శాసించే స్థాయికి ఎదగాలని, అది కేవలం జగనన్నతోనే సాధ్యమవుతుందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ కన్వీనర్ చల్లా మధుసూదన్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ అభిమానులతో మాట్లాడుతూ.. ఎన్నారైలు అందరూ కలిసి పార్టీ ని అధికారం లొకి తీసుకురావడనికి కృషి చేస్తుండటం హర్షనీయమని అన్నారు. ఆ ప్రయత్నాలన్నిటికీ ఈ పార్టీ ఆఫీస్ చక్కగా ఉపయోగపడుతుందని అభిలషించారు. జై జగన్, జోహార్ వైఎస్సార్ నినాదాలతో ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమము పూర్తయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement