నా కోసం చుక్క కన్నీరు కూడా కార్చవద్దు | young man jumped out to running train in kadapa district | Sakshi
Sakshi News home page

నా కోసం చుక్క కన్నీరు కూడా కార్చవద్దు

Oct 10 2017 8:14 AM | Updated on Nov 6 2018 8:08 PM

young man jumped out to running train in kadapa district - Sakshi

సాక్షి, కడప : ‘అమ్మ.. అప్ప.. నన్ను క్షమించండి.. నేను మీరు కోరుకున్నట్లు.. మీరు కలలు కన్నట్లు జీవించలేకపోతున్నాను’ అని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మధ్య వయస్కుడు వెంకట రమేష్‌కుమార్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. సోమవారం మధాహ్నం ముంబై నుంచి చెన్నైకి వెళుతున్న రైలులో నుంచి అతను దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘మీరందరూ అనుకున్నట్లు నేను ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఎటువంటి తప్పు చేయలేదు. 

మీరందరూ సుఖంగా.. సంతోషంగా ఉండాలని వచ్చేశాను. నా తప్పు తెలుసుకున్నాను. కాబట్టే అన్ని వదిలేసి వచ్చాను. కానీ మీరందరూ నా చావును కోరుకుంటే సంతోషంగా చనిపోతున్నాను. మీరు నా కోసం ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చవద్దు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవద్దు.. మీరు నాకోసం కోల్పోయింది చాలు.. నా శవాన్ని కూడా ఇక్కడే వదిలేయండి. నా ఖర్మ కాండలు కూడా చేయవద్దని ప్రార్థిస్తున్నాను. 

నన్ను క్షమించండి. నా దగ్గర రూ.3,100 డబ్బులు.. మొబైల్‌ ఉన్నాయి. అవి తీసుకోండి’ అని లేఖలో పేర్కొన్నారని రైల్వే ఎస్‌ఐ రారాజు తెలిపారు. ఈ మేరకు మృతుడి తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీకి తరలించామని వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement