విలాసాల కోసం దోపిడీలు | Four Men Arrested In Robbery Case In karnataka | Sakshi
Sakshi News home page

విలాసాల కోసం దోపిడీలు

Feb 4 2019 1:21 PM | Updated on Feb 4 2019 1:21 PM

Four Men Arrested In Robbery Case In karnataka - Sakshi

బెంగళూరు : విలాసవంతమైన జీవనానికి చోరీలు, దోపిడీల బాట పట్టిన నలుగురు కటకటాల పాలయ్యారు. దేవనహళ్లికి చెందిన సలీం, గోవిందపుర వాసి మహ్మద్‌షఫీ, నెలమంగళ నివాసి ఇమ్రాన్‌పాష, హాసన్‌ జిల్లా ఆలూరుకు చెందిన లోకేశ్‌ అలియాస్‌ కెంచలోకిలను  పీణ్య పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. నిందితులనుంచి రూ.7లక్షల విలువైన  229 గ్రాముల బంగారం, ఒక బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి ఒకరు రాడ్‌తో తలుపులు తొలగిస్తుండగా మరొకరు బయట కాపలా ఉంటారు.

మిగతా ఇద్దరు లోపలకు చొరబడి చోరీలకు పాల్పడేవారని విచారణలో వెలుగు చూసినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఒంటరిగా వెళ్లేవారిని అడ్డగించి దోపిడీలకు పాల్పడేవారని తెలిపారు. జనవరి 18న పీణ్య పోలీసుస్టేషన్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ లేఔట్‌ పార్క్‌ వద్ద నాగేశ్‌ అనే వ్యక్తికి చెందిన బైక్‌ను నిందితులు చోరీ చేశారన్నారు.  నిందితుడు లోకేశ్‌ హత్య కేసులో జైలుకెళ్లి జామీన్‌పై విడుదలై వచ్చి చోరీలబాట పట్టాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement