
ఎనిమిది నెలల కనిష్టానికి బంగారం ధర
అంతర్జాతీయంగా బంగారం ధర ఎనిమిది నెలల కనిష్టానికి పతనమైంది.
లండన్: అంతర్జాతీయంగా బంగారం ధర ఎనిమిది నెలల కనిష్టానికి పతనమైంది. ఔన్స్ బంగారం ధర 0.2 శాతం తగ్గి 1,222.71 డాలర్లకు చేరుకుంది. మూడు వారాలుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం పసిడి ధర 1,216.03 డాలర్లకు పడిపోయింది. జనవరి 2 తర్వాత బంగారం ధర బంగారం భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లపై సమీక్ష జరపడంతో డాలర్ బలపడింది. డాలరు బలపడితే సహజంగానే పుత్తడి ధర దిగొస్తుంది. అటు ఔన్స్ వెండి ధర కూడా 0.1 శాతం తగ్గి 18.51 డాలర్లకు చేరింది. నిన్న ఈ ధర 18.29 డాలర్లకు పడిపోయింది.