స్పీకర్ స్థానంలో ఉన్నారా? లేక అటువైపు ఉన్నారా? | YS Jagan Mohan Reddy questions speaker Kodela Shiva prasad reddy | Sakshi
Sakshi News home page

స్పీకర్ స్థానంలో ఉన్నారా? లేక అటువైపు ఉన్నారా?

Jun 23 2014 1:47 PM | Updated on Jul 29 2019 2:44 PM

స్పీకర్ స్థానంలో ఉన్నారా? లేక అటువైపు ఉన్నారా? - Sakshi

స్పీకర్ స్థానంలో ఉన్నారా? లేక అటువైపు ఉన్నారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఇరుపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఇరుపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ మానిఫెస్టో, ఇచ్చిన హామీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుతగిలారు. వైఎస్ జగన్ ప్రసంగాన్ని కూడా స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్  కూడా అనుమతించకపోవడంపై వైఎస్ జగన్ స్పందించారు. 
 
స్పీకర్ సార్.. స్పీకర్ స్థానంలో ఉన్నారా? లేక మీరు ఇంకా అటువైపు ఉన్నారా అంటూ తెలుగుదేశం సభ్యులను చూపిస్తూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అందుకు స్పీకర్ కోడెల సమాధానమిస్తూ.. నేను అటూ లేను ఎటూ లేను.. అని వ్యాఖ్యానించారు. స్పీకర్ స్థానంలో తాను ఇరుపక్షాలకు మధ్యవర్తిగా ఉన్నాననే విధంగా స్పందించడంతో సభ్యులు నవ్వుల్లో మునిగిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement