టీడీపీతో పొత్తుపై వరంగల్ జిల్లాలో నిరసనల పర్వం ఊపందుకుంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఏకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి అశోక్ రెడ్డి రాజీనామా
Apr 6 2014 5:30 PM | Updated on Mar 29 2019 9:24 PM
వరంగల్: టీడీపీతో పొత్తుపై వరంగల్ జిల్లాలో నిరసనల పర్వం ఊపందుకుంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఏకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ఎడ్ల అశోక్ రెడ్డి ప్రకటించారు. టీడీపీతో పొత్తుపై తెలంగాణలోని జిల్లాల్లో తీవ్ర నిరసన తెలుపుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
రాజీనామాలు సమర్పించేందుకు సిద్ధమైన జిల్లాల అధ్యక్షులను, ఇతర నేతలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బుజ్జగిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని కిషన్ రెడ్డితోపాటు తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పొత్తుపై అధికారికంగా ప్రకటించేందుకు జవదేకర్, చంద్రబాబుల మీడియా సమావేశానికి అశోక్ రెడ్డి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement