చంద్రబాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా.. | Viaya sai reddy fires on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా..

Apr 25 2020 10:51 AM | Updated on Apr 25 2020 10:56 AM

Viaya sai reddy fires on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్ తీవ్రతను కప్పిపెడుతున్నారని చంద్రబాబునాయుడు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి చంద్రబాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెట్టి వదులుతున్నాడని మండిపడ్డారు. దాస్తే కనపడకుండా పోవడానికి మీ బినామీ ఆస్తులు, బ్లాక్ మనీ కాదని ట్విటర్‌లో పేర్కొన్నారు.
 

కోవిడ్ పరీక్షల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. వైరస్‌పై విజయం సాధించేందుకు ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో శ్రమిస్తోందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ప్రజల సహకారమే కీలకమన్నారు. మహమ్మారి అనేక విధాలుగా వ్యాపిస్తుందని, లాక్ డౌన్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ ఉనికిని తుడిచేయాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement