బీజేపీకి ఇద్దరు సారథులు | Two leaders join BJP | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఇద్దరు సారథులు

Oct 6 2013 3:38 AM | Updated on Mar 29 2019 9:18 PM

సంస్థాగత నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ జిల్లాలో రెండు శాఖలను ఏర్పాటు చేసింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంస్థాగత నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ జిల్లాలో రెండు శాఖలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు గ్రేట ర్ హైదరాబాద్ కమిటీ పరిధిలో ఉన్న జిల్లాలోని 48 జీహెచ్‌ఎంసీ వార్డులతో రంగారెడ్డి అర్బన్ పేరిట కొత్త కమిటీని ప్రకటించింది. గ్రేటర్‌లో మిళితం చేయడంతో శివార్లలో పార్టీని పటిష్టం చేయడం సంస్థాగతంగా కష్టమవుతుం దనే అభిప్రాయానికివచ్చిన రాష్ట్ర నాయకత్వం.. రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజించింది. రంగారెడ్డి గ్రామీణ, రంగారెడ్డి పట్టణ పేరుతో కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాం తానికి అంజన్‌కుమార్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రంగారెడ్డి అర్బన్‌కు మీసాల చంద్ర య్య (నాచారం)ను అధ్యక్షుడిగా నియమిస్తూ శనివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఉత్తర్వులు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement