ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల తొలి రోజునే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల తొలి రోజునే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే మిగిలిన బిల్లులు ఏమైనా ఉంటే వాటిని ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు.
షెడ్యూల్ 13లో నేదునూరు గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్ట్‌ను చేర్చాలని, అలాగే ముంబై నుంచి విశాఖపట్నానికి వెళ్లే 222వ నెంబరు జాతీయ రహదారిని ఉత్తర తెలంగాణ మీదుగా వేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.