ఫేస్‌బుక్ ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య | student died facebook love failed | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య

Jan 27 2014 3:05 AM | Updated on Nov 9 2018 4:36 PM

ఫేస్‌బుక్ ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య - Sakshi

ఫేస్‌బుక్ ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి ప్రేమిస్తున్నానని చెప్పి.. ఆ తర్వాత మాట మార్చడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రామన్నపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుడు తక్కళ్ల మాణిక్యం, మణవ్వ దంపతుల కుమారుడు ఉరుము(23) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు

 సిరిసిల్ల, న్యూస్‌లైన్: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి ప్రేమిస్తున్నానని చెప్పి.. ఆ తర్వాత మాట మార్చడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రామన్నపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుడు తక్కళ్ల మాణిక్యం, మణవ్వ దంపతుల కుమారుడు ఉరుము(23) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కొన్నినెలల క్రితం అతనికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమైంది. వరంగల్ అని చెప్పింది.
 
 కొద్ది రోజుల తర్వాత ప్రేమలో పడ్డ ఉరుము ఆమెకు విషయం చెప్పగా తను కూడా అంగీకరించింది. అయితే, నెల రోజుల నుంచి తనతో చాటింగ్ చేయొద్దని, తాను ప్రేమించడం లేదని చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఆత్మహత్యకు యత్నించగా, తల్లిదండ్రులు సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి కాపాడుకున్నారు. అప్పటి నుంచి సరిగా కళాశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్న ఉరుము ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణం చెందాడు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement