మాస్టర్ ప్లాన్‌కు రూ. 1,200 కోట్లు! | Singapore government seeks Andhra pradesh as a consultant fee | Sakshi
Sakshi News home page

మాస్టర్ ప్లాన్‌కు రూ. 1,200 కోట్లు!

Nov 25 2014 2:25 AM | Updated on May 29 2019 3:19 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వం.. కన్సల్టెన్సీ చార్జీలుగా ఏకంగా రూ. 1,200 కోట్లు చెల్లించాలని కోరినట్లు సమాచారం.

కన్సల్టెన్సీ ఫీజుగా ఆంధ్రప్రదేశ్‌ను కోరిన సింగపూర్ సర్కారు
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వం.. కన్సల్టెన్సీ చార్జీలుగా ఏకంగా రూ. 1,200 కోట్లు చెల్లించాలని కోరినట్లు సమాచారం. కొత్త రాజధాని నిర్మాణానికి ఏర్పాటు చేయబోయే కంపెనీలో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన సింగపూర్ ప్రభుత్వం.. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కన్సల్టెన్సీగా వ్యవహరించడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేసింది.
 
 ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి ఇవ్వాల్సిందిగా స్వయంగా సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేస్తామని, ఆ కంపెనీలో ఆంధ్రప్రదేశ్ వాటా 51 శాతం, సింగపూర్ ప్రభుత్వం 49 శాతం వాటాగా ఏర్పాటు చేద్దామని బాబు ఇటీవల సింగపూర్ పర్యటనలో ప్రతిపాదించారని అధికార వర్గాలు తెలిపాయి. సింగపూర్ ప్రభుత్వం మాత్రం సదరు కంపెనీలో వాటాకు ఆసక్తి చూపలేదని విశ్వసనీయ సమాచారం.దీంతో  మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు మాత్రమే సింగపూర్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement