సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులు భారీస్థాయిలో ఉద్యమించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులు భారీస్థాయిలో ఉద్యమించారు. పశ్చిమ సమైక్య చైతన్య భేరీ పేరుతో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. దీనికి ఉపాధ్యాయులు వేల సంఖ్యలో హాజరయ్యారు.
జిల్లాలోని నలుమూలల నుంచి ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న అనేక మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరై సమైక్య గళం వినిపించారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించుకున్నారు. వచ్చేనెల ఏడో తేదీన తణుకులో 50 వేల మంది ప్రైవేటు ఉపాధ్యాయులతో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఓ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలనుకున్నారు. త్వరలోనే హైదరాబాద్లో కూడా అన్ని వర్గాల ప్రజలతో బహిరంగ సభలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.