లబోదిబో! | Labodibo! | Sakshi
Sakshi News home page

లబోదిబో!

Nov 24 2014 3:00 AM | Updated on Oct 1 2018 2:03 PM

‘అనంత' అన్నదాత పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. రుణమాఫీపై ఆశలు అడియాసలయ్యాయి. బకాయిలు చెల్లించలేదంటూ బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘అనంత' అన్నదాత పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. రుణమాఫీపై ఆశలు అడియాసలయ్యాయి. బకాయిలు చెల్లించలేదంటూ బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు. రుణాలు ఇచ్చే పరిస్థితి ఎటూ లేకపోవడంతో రైతులు కూడా బ్యాంకులకు వెళ్లలేదు. ఈ క్రమంలోనే వాతావరణబీమా ప్రీమియం సైతం చెల్లించలేకపోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

రైతులు ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా వచ్చే పరిస్థితి లేదు. గతేడాది బీమా సొమ్ము ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. కళ్లెదుట కనిపిస్తోన్న పంట నష్టం...తలకు మించిన భారంగా ఉన్న అప్పులు..‘రుణమాఫీ’ పేరుతో మోసపోయిన వైనం...ఇలా అన్నిరకాలుగా ‘అనంత’ రైతులు నిలువునా మోసపోయారు.

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5.06 ల క్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. వర్షాభావంతో పంట పూర్తిగా ఎండిపోయింది. సాధారణ వర్షపాతం 338 మిల్లీమీటర్లు (మి.మీ) నమోదు కావాల్సి ఉంటే.. 172.7 మి.మీకే పరిమితమైంది. దీనివల్ల పంట పూర్తిగా దెబ్బతినింది. వ్యవసాయాధికారులు కూడా 4.96 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు తేల్చారు.

 సర్కారు తీరుతో బీమా దూరం..
 ‘అనంత’ రైతులను ఏటా అనావృష్టి గానీ, అతివృష్టి గానీ దెబ్బతీస్తోంది. రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమాపై ఆధారపడి పంటల సాగుకు ఉపక్రమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మాత్రం బీమా ప్రీమియం చెల్లించకుండానే సాగు చేశారు. తమ ప్రభుత్వం  రాగానే రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో అప్పుల ఊబి నుంచి ఉపశమనం లభిస్తుందని రైతులు ఆశపడ్డారు.

ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి ఉంటే జిల్లాలో 6.08 లక్షల మంది  రైతులకు సంబంధించిన రూ.3,093 కోట్ల పంట రుణాలతో పాటు బంగారు తాకట్టుపై 2.12 లక్షల మంది తీసుకున్న రూ.1,851 కోట్ల రుణాలు మాఫీ అయ్యేవి.  ప్రభుత్వం ఏ ఒక్క రైతుకూ రూపాయి కూడా మాఫీ చేయలేదు. కనీసం రీషెడ్యూలు చేసి కొత్త రుణాలు ఇప్పించేలా బ్యాంకర్లను ఒప్పించలేకపోయింది. ఈ క్రమంలో పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు తేల్చి చెప్పారు.

 ప్రీమియం కట్టింది కొందరే..
 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,350 కోట్ల  పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే.. గతేడాదికి సంబంధించిన రూ.2,600 కోట్ల  బకాయిలతో పాటు పాతబకాయిలను రైతులు చెల్లించలేకపోయారు. దీనివల్ల బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు. ఖరీఫ్‌లో రూ.350 కోట్ల పంట రుణాలు, రూ.400 కోట్ల గోల్డ్‌లోన్లు మాత్రమే ఇచ్చారు. ఏటా రైతులు పంట రుణాలు తీసుకునే డబ్బులోనే బీమా ప్రీమియాన్ని బ్యాంకర్లు మినహాయించుకునేవారు.

ఈ ఏడాది రుణాలు తీసుకోకపోవడంతో ప్రీమియం చెల్లించే వెసులుబాటు లేకుండా పోయింది.  ప్రీమియం మాత్రమే చెల్లిం చేందుకు  రైతులు ముందుకెళ్లగా.. చాలాచోట్ల బ్యాంకర్లు స్వీకరించలేదు. ఫలి తంగా ఈ ఏడాది 17 శాతం మంది రైతు లు మాత్రమే వాతావరణ బీమా ప్రీమియాన్ని చెల్లించారు. త క్కిన 83 శాతం మంది బీమాకు దూరమయ్యారు. ప్రభుత్వం రుణమాఫీ చేసినా లేదా కొత్త రుణా లు ఇప్పించగలిగినా ఈ ఏడాది రైతులకు వాటిల్లిన రూ.1,600 కోట్ల పంట నష్టం లో కొంతమేర అయినా భర్తీ అయ్యేది.
 
 ఇది మరో రకమైన మోసం
 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.220 కోట్ల  వాతావరణ బీమా మంజూరైంది. ఈ మొత్తం విడుదలై నెల రోజులు దాటింది. అక్టోబరు 20లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని జిల్లా మంత్రులు ప్రకటించారు. ఇప్పటికీ అతీగ తీ లేదు. బీమా సంస్థ నుంచి విడుదలైన సొమ్ము నెలరోజుల పాటు రైతుల ఖాతా ల్లో జమ చేయకుండా బ్యాంకర్లు ఆపేం దుకు వీల్లేదు. అయితే.. బీమా సొమ్మును పాతబకాయిల కింద జమ చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement