వైకుంఠ ఏకాదశి సందర్బంగా శ్రీ కల్యాణ వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు.
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్బంగా శ్రీ కల్యాణ వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి క్యూలోనే భక్తులు వేచి ఉన్నా వెంకన్న దర్శన భాగ్యం కలగకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీఐపీలకు ప్రాధాన్యాత ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్వదినాన దేవుడ్ని ఎందుకు దర్శించుకోవడానికి వచ్చామనే భావన వారిలో వ్యక్తమవుతోంది.
భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో కొంతమంది వృద్ధ మహిళలు సొమ్ముసిల్లి పడిపోయారు.ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వీఐపీ టికెట్లను అమ్ముకుని వారికి కావాల్సిన వారిని లోనికి అనుమతిస్తున్నారు.