చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం కప్పలనట్టంలో మంగళవారం ఉదయం అప్పుల బాధతో సుబ్రహ్మాణ్యం(30) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం కప్పలనట్టంలో మంగళవారం ఉదయం అప్పుల బాధతో సుబ్రహ్మాణ్యం(30) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరి చివరన ఉన్న చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల తన పొలంలో బోర్లు వేసినా చుక్క నీరు పడకపోవటం, అప్పులు తీర్చే మార్గం కనపడకపోవటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.