పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నకిటీ నోట్లను చెలామణి చేస్తున్న సంఘటన వెలుగు చూసింది.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు పాలకొల్లు, నర్సాపురం పరిసర ప్రాంతాలకు చెందినవారు.
నిందితుల నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఏలూరు రేంజి డీఐజీ ఇచ్చిన సమాచారంతో నిందితులను పట్టుకున్నట్టు చెప్పారు.