జైట్లీ హామీ ఇచ్చారు: సుజనా చౌదరి | chandrababu naidu meets arun jaitley | Sakshi
Sakshi News home page

జైట్లీ హామీ ఇచ్చారు: సుజనా చౌదరి

May 19 2015 9:32 AM | Updated on Sep 2 2018 5:11 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా జైట్లీని కలిసిన...

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా జైట్లీని కలిసిన వారిలో ఉన్నారు. భేటీ అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ
పోలవరం సహా ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై చర్చించినట్లు చెప్పారు. ప్రాజెక్ట్ల నిర్మాణానికి నిధుల కొరత ఉండదని జైట్లీ హామీ ఇచ్చినట్లు సుజనా చౌదరి తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిని కలుపుతూ హైవేల నిర్మాణం చేపట్టనున్నట్లు సుజనా పేర్కొన్నారు. కాగా పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతిని చంద్రబాబు నిన్న కలిసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement