ఆదోనిలో ఏడురోజుల పసికందు మాయం | 7days infant go missing at Kurnool district | Sakshi
Sakshi News home page

ఆదోనిలో ఏడురోజుల పసికందు మాయం

Feb 2 2015 12:53 PM | Updated on Sep 2 2017 8:41 PM

ఆదోనిలో పసికందులను ఎత్తుకెళ్లే గ్యాంగ్ కలకలం సృష్టిస్తోంది.

కర్నూలు: జిల్లాలోని ఆదోనిలో పసికందులను ఎత్తుకెళ్లే గ్యాంగ్ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులనే లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా పసిబిడ్డలను మాయం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా మండలంలోని భావన చిన్న పిల్లల ఆసుపత్రిలో ఏడు రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తి సోమవారం ఎత్తుకెళ్లాడు. 

వివరాల్లోకి వెళితే..  మధిర గ్రామానికి మహదేవ మొదటి కాన్పు నిమిత్తం తన భార్య గౌరమ్మను విజయలక్ష్మీ నర్సింగ్ హోమ్‌లో చేర్పించాడు. గౌరమ్మకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఏడు రోజుల తర్వాత బిడ్డకు ఆరోగ్యం బాగాలేకపోతే దగ్గరలోని భావన చిన్న పిల్లల ఆసుపత్రిలో చేర్పించటానికి మహదేవ తీసుకెళ్లారు. టోకెన్ తీసుకోవడానికి బిడ్డను వేరే వ్యక్తి చేతిలో పెట్టగా.. వచ్చి చూసేసరికి ఆ వ్యక్తి మాయమయ్యాడు. బిడ్డ అదృశ్యమయ్యేసరికి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

పోల్

Advertisement