breaking news
-
ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో నాటకీయ పరిణామాలు
తిరుపతి,సాక్షి: సత్యవేడు టీడీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో హైడ్రామా నడుస్తోంది. మొక్కుబడిగా ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఎమ్మెల్యే ఆదిమూలం చెన్నై నుంచి పుత్తూరులో తన నివాసానికి చేరుకున్నారు. అయితే.. ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఆయన కుటుంబ సభ్యుల్ని తప్ప ఎవరిని లోపలికి అనుమతించటం లేదు. మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఇంకా రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. వైద్య పరీక్ష జరిగిన నేపధ్యంలో వచ్చే రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను తిరుపతి ఈస్ట్ పోలీసులు విచారించే అవకాశం ఉంది. హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌లో..మరోవైపు.. బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్‌లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్‌కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు.ఇరువైపులా మహిళా అడ్వొకేట్లేఎమ్మెల్యే ఆదిమూలం అత్యాచారం కేసుకు సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. అయితే.. పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్ ప్రస్తావించారు. ఆదిమూలం పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆదిమూలం తరపున అడ్వకేట్ శేషకుమారీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రభుత్వం తరపున న్యాయవాది ఏ వరలక్ష్మి వాదించనున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళా అడ్వకేట్ వాదనలు వినిపించనుండటం విశేషం.ఇదీ చదవండి: ఆదిమూలం రాసలీలలు.. ఫిర్యాదును లోకేష్ సైతం పట్టించుకోలేదా? -
దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త
సైదాపురం: క్షణికావేశంలో తాలికట్టిన భార్యపై అనుమానంతో కత్తితో దారుణంగా నరికి చంపేశాడు ఓ భర్త. అనంతరం బిడ్డలతో కలిసి పోలీసు స్టేషన్లో లొంగిపోయిన ఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. రాపూరు సీఐ విజయకృష్ణ అందించిన వివరాల మేరకు.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన చింతలపూడి మహేంద్ర(33)కు అదే గ్రామానికి చెందిన లావణ్యకు 11 ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి వరుణ్(10), జయవర్ధన్(8) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట నెల్లూరుకు కాపురం మార్చారు. అయితే వీరి మధ్య ఏడాది నుంచి వివాదం జరుగుతుండేది. ఈ క్రమంలో ఇటీవలే స్వగ్రామానికి వెళ్లారు. మహేంద్రకు తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దుస్తులు సర్దుకుని తన అమ్మవారి పుట్టినిల్లు అయిన చిట్వేల్‌కు చేరుకునేందుకు లావణ్య సిద్ధమైంది. ఇరుగు పొరుగు వారు సర్దిచెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మళ్లీ ఇంటి నుంచి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించడంతో మహేంద్ర క్షణికావేశంలో అక్కడే ఉన్న కత్తి తీసుకుని తలపై కొట్టి గొంతు కోశాడు. దీంతో లావణ్య చనిపోవడంతో ఇద్దరు బిడ్డలను తీసుకుని మహేంద్ర సైదాపురం పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు లొంగిపోయాడు. ఎస్ఐ క్రాంతికుమార్, సీఐ విజయకృష్ణ ఘటనా స్థలికి చేరుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. కేసును నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి రోదన చూసి స్థానికులు చలించిపోయారు. -
AP: దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మంగళవారం(సెప్టెంబర్10) అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళుతున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిలకావారి పాకల వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. జీడి గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతులను నిడదవోలు మండలం తాడిమళ్ల వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 10 మంది ఉన్నారు. డీసీఎం కేబిన్‌లో ఉన్నవారికి మాత్రం ఏమీ కాలేదు.ఇదీ చదవండి.. మాకు అడ్డొస్తే చంపేస్తాం -
మాకు అడ్డొస్తే చంపేస్తాం..
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘మేము అధికారంలో ఉన్నాం.. మేం ఏం చెప్పినా జరుగుతుంది’ అంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండ చూసుకుని రోజూ మండలంలోని ఏదో ఒక గ్రామంలో అలజడి సృష్టిస్తున్నారు. మంగళవారం కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్ నాటు తుపాకీ, కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించాడు. అతని తీరుతో విసుగు చెందిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇతను గతంలోనూ పెనుకొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఆధిపత్యం కోసం అలజడులు స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని తొమ్మిది పంచాయతీలకు గాను ఏడుచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. తొమ్మిది ఎంపీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దీన్ని జీరి్ణంచుకోలేని పరిటాల కుటుంబం సొంత మండలంలో ఆధిపత్యం కోసం గ్రామాల్లో గొడవలకు ఆజ్యం పోస్తోంది. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కుంటిమద్దిలో అలజడి సృష్టించే క్రమంలోనే పరిటాల అనుచరుడు గంగాధర్ ఎంపీటీసీ భర్తను తుపాకీతో బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు. -
అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం.. మహిళపై దాడి
సాక్షి, నంద్యాల: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌లో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే పచ్చ మంద.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఇక, తాజాగా నంద్యాల జిల్లాలో అఖిలప్రియ మద్దతుదారులు మహిళలపై భౌతిక దాడులు చేస్తున్నారు.ఆళ్లగడ్డలో రెడ్ బుక్ రాజ్యాంగంనంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. తాజాగా అఖిలప్రియ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి కబ్జాలు చేస్తున్నారు. తాజాగా ఆళ్లగడ్డకు చెందిన విశ్వనాథం పెద్ద కొండయ్య స్థలాన్ని కబ్జాకు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న కొండయ్య కూతురిపై పచ్చ మంద విరుచుకుపడింది. అఖిలప్రియ అనుచరుడు రవి చంద్రారెడ్డి ఆమెను అసభ్యపదజాలంతో తిడుతూ రెచ్చిపోయాడు. ఆమెపై దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. చేయి విరగడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి కూటమి ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకుంటున్నారు.నా టార్గెట్ వంద మంది: అఖిలప్రియకొన్ని రోజుల క్రితమే తనకు ఓ రెడ్ బుక్ ఉంది అంటూ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. రానున్న రోజుల్లో ఆళ్లగడ్డలో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు. వంద మందిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను అంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
అద్దె ఇల్లు.. ఆరుబయటనే శవం
ఇబ్రహీంపట్నం: మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రజల మెదళ్లను శాసిస్తూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటూ ఉన్న ఆ బాలుడు.. మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంటు వేసి ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రసాద్‌నగర్‌లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విషజ్వరంతో.. కూలి చేసుకునే పాలపర్తి రాజేష్, రూతు దంపతులకు ఇద్దరు కుమారులు. జెడ్పీ పాఠశాలలో పెద్ద కుమారుడు ఏడో తరగతి, చిన్న కుమారుడు జాన్ వెస్లీ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రసాద్‌నగర్ వరద ముంపునకు గురికావడంతో పారిశుద్ధ్యలేమి, కలుషిత తాగునీరు, అందుబాటులో లేని వైద్య సదుపాయం వల్ల కొద్ది రోజుల క్రితం బాలుడు జాన్‌వెస్లీ జ్వరం బారిన పడ్డాడు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడితో వైద్యం చేయించారు. మరలా కడుపులో నొప్పి రావడంతో రెండురోజుల క్రితం మరో ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. వారు మెడికల్ టెస్ట్‌లు రాయగా.. తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేక చేయించలేదు. దీంతో కడుపులో నొప్పి భరించలేక బాలుడు మృత్యువాత పడ్డాడని తల్లిదంద్రులు చెబుతున్నారు. మంటగలసిన మానవత్వం.. వారు ఉంటున్నది అద్దె ఇల్లు కావడంతో ఆ యజమాని బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. దీంతో 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనే టెంట్‌వేసి బంధువుల కడసారి చూపుకోసం ఉంచారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ బాలుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఆపై ఆత్మహత్య
ఎన్పీకుంట: దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆపై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలం సారగుండ్లపల్లిలో జరిగింది. కదిరి డీఎస్పీ శ్రీలత, రూరల్ సీఐ నాగేంద్ర కథనం ప్రకారం... సారగుండ్లపల్లికి చెందిన పి.జనార్దన (36) తన భార్యను పుట్టినిల్లు అయిన తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో వదిలి ఆదివారం రాత్రి స్వగ్రామానికి బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలోని కొత్తమిద్ది గ్రామంలో వినాయక మండపం వద్ద రాత్రి 8 గంటల సమయంలో ఆడుకుంటున్న దివ్యాంగురాలైన 17 ఏళ్ల బాలికను కంపచెట్లలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న చిన్న పిల్లలు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జనార్దనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..జనార్దన తన స్వగ్రామంలో నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోని వంట గదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని సోమవారం ఉదయం తల్లి గమనించింది. కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్పీకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు మృతుడిని పరిశీలించగా చేతికి, వేలుకు ఇంకు అంటి ఉండటాన్ని గమనించి ఘటన స్థలంలో వెతకగా సూసైడ్‌నోట్ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
విశాఖ కైలాసగిరి వద్ద టూరిస్ట్ బస్సుకి ప్రమాదం
విశాఖపట్నం, సాక్షి: కైలాసగిరి వద్ద సోమవారం సాయంత్రం ఘోరం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో మలుపు వద్ద కొండను బస్సు ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, వీళ్లంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన టూరిస్టులు అని తెలుస్తోంది. వీళ్లలో 18 మందికి 18 మందికి స్వల్ప గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. 16 మందికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేయగా.. మరో ఇద్దరికి మాత్రం కేజీహెచ్ వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. -
ఆత్మహత్య చేసుకుంటా
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించింది. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేయకపోవడంతో.. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’నంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసింది. దీంతో నియోజకవర్గ టీడీపీలో తీవ్ర దుమారం రేగింది. చంద్రబాబు, లోకేశ్ వల్లే..వరలక్ష్మికి టీడీపీలోని యాదవ సామాజికవర్గ నాయకులు మద్దతుగా నిలిచారు. వరలక్ష్మికి న్యాయం చేయడం మానేసి.. తిరిగి ఆమెనే వేధింపులకు గురిచేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర భాషతో నీచాతినీచంగా తిడుతూ.. ఫోన్‌కాల్స్ చేసి వేధిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వెంటనే స్పందించి.. కఠిన చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్నారు. బలవంతపు మరణానికి దారితీసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. బాధితురాలి ప్రాణానికి హాని జరిగితే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.దళిత ఎమ్మెల్యేపై కుట్ర చేశారంటూ ఆందోళనటీడీపీలోని అగ్రకుల నాయకులు కుట్ర పన్ని ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఈ కేసులో ఇరికించారంటూ స్థానిక దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం సత్యవేడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. వరలక్ష్మిపై కేసు నమోదు చేసి, ఆమె వెనుక ఎవరున్నారో విచారించి.. శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే నారాయాణవనం మండలంలో కూడా ఆదిమూలం వర్గీయులు రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఓ మాజీ ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా నియమించి పెత్తనం చెలాయించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆదిమూలం వర్గీయులు కొందరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్‌కు ఫోన్ చేసి.. వరలక్ష్మి కేసు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. -
గంజాయి స్మగ్లింగ్ కేసులో జనసేన నేతపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో ఇష్టారీతిన గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు బహిరంగంగానే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా గంజాయి కేసులో జనసేన నేతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.వివరాల ప్రకారం.. అనకాపల్లి చీడికడ మండల జనసేన అధ్యక్షుడు వరాహ మూర్తి గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. కేరళలో గంజాయితో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో, కేరళ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అనకాపల్లి వచ్చి కేరళ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో వరాహ మూర్తిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు.. వరాహా మూర్తి గంజాయి కేసులో పట్టుబడటంతో అతడిని మండల అధ్యక్ష పదవి నుంచి జనసేన పార్టీ తొలగించినట్టు సమాచారం. గంజాయి కేసులో దొరికిన జనసేన మండల అధ్యక్షుడు కేరళలో గంజాయితో అడ్డంగా బుక్ అయిన అనకాపల్లి జిల్లా చీడికడ మండల జనసేన అధ్యక్షుడు వరాహ మూర్తికేరళ నుంచి అనకాపల్లి జిల్లాకి వచ్చి నోటీసులు ఇచ్చిన పోలీసులుకూటమి ప్రభుత్వంలో ఇష్టారీతిన గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న @JaiTDP,… pic.twitter.com/QGrLCcuB8I— YSR Congress Party (@YSRCParty) September 7, 2024 -
అనుమానం పెనుభూతమై..!
చంద్రగిరి(తిరుచానూరు): అనుమానం పెనుభూతమై వారి కాపురాన్ని ఛిద్రం చేసింది. కట్టుకున్న దాన్ని కర్కశంగా గొంతు కోసి హతమార్చేందుకు ప్రేరేపించింది. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం మంగళంలో భార్యను చంపేసిన భర్త అనంతరం పోలీసులకు లొంగిపోయిన ఘటన సంచలనంగా మారింది. వివరాలు.. మంగళం క్వార్టర్స్ కు చెందిన రమేష్, తిరుపతి ఎస్టీవీ నగర్‌కు చెందిన రూపావతికి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుమార్తెలు చందనప్రియ, కుందన ప్రియతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా రమేష్‌కు తన భార్యపై అనుమానం పెరిగింది. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.ఈ క్రమంలో 10 రోజుల క్రితం రూపావతి పిల్లలతో కలసి పుట్టింటికి వెళ్లిపోయింది.పండుగ కోసం ఇంటికి తీసుకొచ్చి..!అత్తగారింటికి వెళ్లిన భార్యను పండుగగా తీసుకురావాలని గురువారం రమేష్ తన తండ్రి, తమ్ముడితో కలసి ఎస్టీవీ నగర్‌కు వెళ్లాడు. ఇకపై ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరగవని, పిల్లలను, భార్యను పోషించుకుంటామని చెప్పి మంగళం క్వార్టర్స్‌లోని ఇంటికి తీసుకువచ్చాడు. శుక్రవారం వేకువజామున రమేష్ ఫూటుగా మద్యం తాగి ఇంటికి వెళ్లి మరోసారి భార్యతో ఘర్షణకు దిగాడు. ఆగ్రహం పట్టలేక గదిలో నుంచి ఇద్దరు పిల్లలను బయటకు పంపించి, గడియ పెట్టాడు. పిల్లలు కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా ఇంట్లోని కత్తి తీసుకుని రూపావతి గొంతు కోసి హతమార్చాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకుని, గది తలుపులు తీసి, పిల్లల వద్దకు వచ్చి మీ అమ్మ చనిపోయిందంటూ కేకలు వేశాడు. అక్కడ నుంచి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.అనుమానంతోనే హతమార్చాడు : అడిషనల్ ఎస్పీభార్యపై అనుమానంతోనే రమేష్ హతమార్చాడని అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్‌తో కలసి ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. తాడేపల్లి పోలీసుల ఓవరాక్షన్
గుంటూరు, సాక్షి: తాడేపల్లి పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్‌ను ఈ ఉదయం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్టు విషయంలో వెంకటరామిరెడ్డికి కోర్టు ఇదివరకు ఊరట ఇచ్చింది. ఆయన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయినా ఆ గడువు ఆదేశాలను పట్టించుకోకుండా ఈ ఉదయం 11గం.కే ఆయన్ని ఇంటి నుంచి తాడేపల్లి పోలీసులు తీసుకెళ్లారు. ఆయన్ని ఎక్కడి తీసుకెళ్లారు? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
మాజీ ఎంపీ సురేష్ కు 14రోజుల రిమాండ్
సాక్షి, అమరావతి/మంగళగిరి : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధవారం అర్థరాత్రి దాటాక హైదరాబాద్‌లో అరెస్టుచేసిన పోలీసులు ఆయనను గురువారం ఉ.8.30 గంటలకు మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుచేసిన పోలీసులు స్టేషన్లో ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈయనతోపాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసులరెడ్డిని కూడా అరెస్టుచేసిన మంగళగిరి రూరల్ పోలీసులు వీరిద్దరినీ మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం వీరిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో తమను అడ్డుకోలేరని, 2029లో చంద్రబాబుకు బుద్ధిచెప్పి తీరుతామన్నారు. కక్షతోనే తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెడుతున్నారని.. ప్రజలు, దేవుడు చూస్తున్నారని చెబుతూ జై జగన్ అంటూ నినదించారు. అంతకుముందు.. స్టేషన్ వద్ద సురేష్ సతీమణి బేబీలత మాట్లాడుతూ.. తన భర్తపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టారన్నారు. కేసులతో తమను భయపెట్టలేరని, 2019కు ముందు పొలాల దగ్థం కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని అప్పట్లో తన భర్తపై టీడీపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా లొంగలేదని.. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడేదిలేదని స్పష్టంచేశారు. ఇక సురే‹Ùను అరెస్టుచేశారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్‌బాబు, వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల అమలు కమిటీ మాజీ చైర్మన్ నారాయణమూర్తి, గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాలవజ్ర బాబు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కమ్మూరి కనకారావు తదితరులతో పాటు కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకుని ఆయనకు మద్దతు పలికారు. -
బాలికపై ప్రిన్సిపాల్ భర్త లైంగిక దాడికి యత్నం
లక్కిరెడ్డిపల్లి: ఐదో తరగతి చదువుతున్న బాలికపై 55 ఏళ్ల ఓ కామాంధుడు అఘాయిత్యానికి యతి్నంచాడు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పరిమళ భర్తగా చెప్పుకొనే బాలసుబ్బయ్య ఆదివారం సాయంకాలం లడ్డూ ఆశ చూపి చిన్నారిని ప్రిన్సిపాల్ రూమ్‌లోకి పిలిచి లైగింక దాడికి యతి్నంచాడు. బాలిక ఎదురు తిరగడంతో దాడి చేశాడు. దీంతో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని హాస్టల్ భవనంలోకి వెళ్లిపోయింది. తోటి విద్యార్థులకు విషయం చెప్పడంతో వారు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ విషయం ఎవరికీ చెప్పొద్దొని ప్రిన్సిపాల్ విద్యార్థులను హెచ్చరించింది. సోమవారం మధ్యాహ్నం ఈ విషయం బయటకు పొక్కడంతో లక్కిరెడ్డిపల్లె పోలీసులు పాఠశాలకు చేరుకుని బాలసుబ్బయ్యను అదుపులోకి తీసుకున్నారు. రోజూ సాయంత్రం ప్రిన్సిపాల్ భర్త మరో ఇద్దరిని వెంటబెట్టుకుని పాఠశాల ఆవరణలోకి చొరబడతారని, తాము దుస్తులు మార్చుకుంటుంటే సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తారంటూ విద్యార్థులు విలపించారు. అనంతరం ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు.. అంటూ విద్యార్థులు పాఠశాల గేటు ఎదుట నినాదాలు చేశారు. అంతలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఆర్డీవో రంగస్వామి, తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్న పాఠశాల వద్దకు చేరుకుని తల్లిదండ్రులను సముదాయించారు. తమ పిల్లలను పంపించాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాగా, బాలిక బంధువులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల అదుపులో ఉన్న బాలసుబ్బయ్యకు దేహశుద్ధి చేశారు. బాలసుబ్బయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీంద్రబాబు చెప్పారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ పరిమళ, హెల్త్‌సూపర్‌వైజర్ లక్ష్మీదేవి, సెక్యూరిటీ గార్డు నాగలక్ష్మీలను సస్పెండ్ చేశారు. -
మైనర్‌పై అత్యాచారం
అవుకు: ఇంట్లో ఎవరూ లేని సమయం తెలుసుకున్న ఓ ప్రబుద్ధుడు తాగడానికి మంచినీళ్లు అడిగి... అదే అదునుగా మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన నంద్యాల జిల్లా, అవుకు మండల పరిధిలోని కాశీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీపురం గ్రామానికి చెందిన మైనర్ కోవెలకుంట్ల పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ప్రభుదాసు అనే వ్యక్తి ఇదే పాఠశాల వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.రోజూ బాలిక ఇదే వ్యాన్‌లో ఊరికి వచ్చేది. ఆదివారం బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరనే విషయం తెలుసుకున్న నిందితుడు ఇంటి వద్దకు వెళ్లి బాలికను..మీ నాన్న ఇంట్లోలేడా అని అడిగి.. తాగేందుకు మంచినీళ్లు తీసుకురమ్మన్నాడు. బాలిక ఇంట్లోకి వెళ్లగానే నిందితుడు తలుపులు వేసి బాలికనోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలో బాలిక తల్లి ఇంటికి తిరిగి వచ్చి గేటు తీసింది. గేటు శబ్దం విన్న నిందితుడు బాలికను బెదిరించి మంచం కింద దాక్కున్నాడు. అప్పటికే భయాందోళనగా ఉన్న బాలిక తలుపులు తెరవగానే చెంపపై కాట్లు ఉండటంతో తల్లి ప్రశి్నస్తూనే నిందితుడిని గమనించింది. దీంతో కేకలు వేయగా, చుట్టుపక్కల వారు, బంధువులు బాలిక ఇంటికి వచ్చి నిందితుడిని కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
భార్యను ఏమార్చి రెండో వివాహం
కందుకూరు: భార్యతో ప్రేమగా ఉంటూనే ఆమె కళ్లుగప్పి మరో వివాహం చేసుకున్నారో ప్రబుద్ధుడు. విషయం తెలుసుకున్న ఆమె కల్యాణ మండపానికి చేరుకునేలోపే మరో యువతితో వివాహం జరిగిపోయింది. దీంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కందుకూరు పట్టణంలో ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. దగదర్తి మండలం ధర్మవరానికి చెందిన యర్రయ్య కుమారుడు రూబేను బీటెక్ పూర్తి చేశారు. కావలిలోని కచ్చేరిమిట్ట కాలనీలో నివాసం ఉంటున్న అరుణకుమారి, విజయ్‌కుమార్ దంపతుల కుమార్తె నీలిమతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో వీరు 2012లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి కెవిన్ రూబెన్, స్టెపానీ గోల్డ్ పిల్లలు. ఈ క్రమంలో గ్రామంలో మీ సేవ, ఆన్లైన్ సెంటర్‌ను కొంతకాలం నిర్వహించారు. అనంతరం దంపతుల నడుమ ఏర్పడిన విభేదాలు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాయి. పెద్దల సమక్షంలో రాజీ చేసుకొని ఇటీవల నుంచి సఖ్యతగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగమంటూ రూబేను హైదరాబాద్ వెళ్లారు. అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు భార్య, పిల్లలను నమ్మించారు. కావలి కోర్టులో ఉద్యోగం చేస్తున్న నీలిమ అక్కడే ఉంటూ పిల్లలను చూసుకోసాగారు. ఫోన్ నంబర్ బ్లాక్ నిత్యం భార్యాపిల్లలతో ఫోన్లో మాట్లాడే రూబేను అకస్మాత్తుగా నీలిమ నంబర్‌ను బ్లాక్ చేశారు. కోర్టు విధులకు శుక్రవారం హాజరైన నీలిమ.. రూబేనుకు కందుకూరులో మరో వివాహం జరుగుతోందనే విషయాన్ని పాస్టర్ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే పిల్లలు, బంధువులతో కలిసి వివాహం జరుగుతున్న ఎస్వీఎస్ కల్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకునేసరికే భర్త రెండో వివాహం పూర్తయిపోయింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రూబేనును స్టేషన్‌కు తరలించారు. పేరు మార్చుకొని.. వివాహం కోసం తన పేరును ఆదర్శ్‌గా మార్చుకొని కందుకూరు మండలం కోవూరుకు చెందిన శ్రీవాణిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్య వచ్చి బండారం బయటపెట్టడంతో పెళ్లి వివాదంగా మారింది. దీంతో శ్రీవాణిని ఆమె తరఫు బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. -
డైట్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు
సాక్షి, అనకాపల్లి : అధికార పార్టీకి సంబంధించినవైతే చాలు పోలీసులు ఎలాంటి ఘోరాలు, నేరాలు అయినా నోరు మెదపడంలేదు. టీడీపీ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ అనకాపల్లిలో నడుపుతున్న దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆగడాలే ఇందుకు ఉదాహరణ. మెంటార్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ మురళి తనను వేధిస్తున్నాడని ఇంజినీరింగ్ సెకండియర్ విద్యార్థిని చాలాకాలంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎట్టకేలకు అరెస్టుచేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు. కానీ, ఈ విషయాన్ని అనకాపల్లి టౌన్ పోలీసులు చాలా గోప్యత పాటిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెంటార్ మురళి ఏడాది కాలంగా వేధిస్తున్నాడని బాధితురాలు పేర్కొంటోంది. ప్రతిరోజు రాత్రులు తనకు ఫోన్‌చేసి మాట్లాడాలని, వాట్సాప్ మెసేజ్‌లు చేయాలని, కళాశాలకు వచ్చినప్పుడు తనను కలవాలని, హగ్ చేసుకోవాలని రకరకాలుగా వేధిస్తుండటంతో ఆమె నరకం అనుభవిస్తోంది. అతని వేధింపులు భరించలేక తన స్నేహితుడికి సమస్యలు వివరించడంతో.. ఇటీవల ఆ యువకుడు మురళిని ప్రశ్నించగా ‘నీకేందుకురా పో’.. అంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ దురుసుగా ప్రవర్తించాడు. మీ ఇద్దరి మధ్య వేరే సంబంధం ఉందని మీ తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. అధ్యాపకుడి ఫోన్‌కాల్ రికార్డింగ్ ఆధారంగా కళాశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో బాధిత విద్యార్థిని జిల్లా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సైతం ఈ విషయాలను రహస్యంగా ఉంచడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు.. తమ కుమార్తెపట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడ్ని 14రోజులపాటు రిమాండ్ విధించినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ విషయం సీఐ వెల్లడించకపోవడం గమనార్హం. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళి గతంలో చాలామందిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, కళాశాలలో మెంటర్ కావడంతో విద్యార్థులు మౌనంగా భరిస్తున్నారని ఇతర విద్యార్థులు చెబుతున్నారు. -
ఆస్పత్రి దూరమై.. రహదారి నరకమై..
చింతూరు: సకాలంలో వైద్యం అందకపోవడంతో అప్పుడే పుట్టిన మగబిడ్డ మృత్యువాత పడిన విషాద ఘటన చింతూరు మండలం కలిగుండంలో శుక్రవారం చోటు చేసుకుంది. కలిగుండం గ్రామానికి చెందిన కుంజా జయమ్మ స్థానిక మినీ అంగన్వాడీ కేంద్రంలో వర్కర్‌గా పనిచేస్తున్నది. గర్భిణీ అయిన జయమ్మకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా వచ్చేనెల 18న కాన్పు అయ్యే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు ఆమె భర్త సీతారాం తెలిపాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున జయమ్మకు అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు భర్త సీతారాం సిద్ధమయ్యాడు. తమ గ్రామం నుంచి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆమెను రెండు కిలోమీటర్ల దూరంలోని పేగకు కాలినడకన తీసుకెళ్లేందుకు గ్రామస్తుల సాయం కోరాడు. మార్గమధ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రవంక వాగును ప్రాణాలకు తెగించి దాటించి పేగకు చేరుకున్నారు. అప్పటికే పురిటి నొప్పులతో అల్లాడిన జయమ్మకు వ్యయప్రయాసతో గుండెల్లోతు నీళ్లలో వాగు దాటడంతోపాటు, రెండు కిలోమీటర్లు కాలినడకన రావడంతో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు తోడుగా వచ్చిన ఆశా కార్యకర్త వెంటనే పేగలోనే ఓ ఇంటిలో కాన్పు చేయడంతో జయమ్మ మగబిడ్డకు జన్మనిచ్చి0ది. బిడ్డను కాపాడుకునేందుకు.. పుట్టిన బిడ్డకు అస్వస్థతగా ఉండడంతో ఆ బిడ్డను కాపాడుకునేందుకు పేగ నుంచి ఆటోలో ఏడు కిలోమీటర్ల దూరంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, చింతూరు ఏరియా ఆస్పత్రిలోని చిన్నపిల్లల వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సులో చింతూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే బిడ్డ మృతి చెందిందని చెప్పారు. దీంతో బిడ్డను కోల్పోయిన దంపతులు గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. -
AP: గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు.. విద్యార్థినిల ఆందోళన
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థినిల వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థే ఇందుకు కారణమని అతడిని చితకబాదారు. ఈ సందర్భంగా రాత్రంతా విద్యార్థులు ధర్నాకు దిగారు.వివరాల ప్రకారం.. గుడివాడ మండలం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చారు. ఓ విద్యార్థిని సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినిలు.. మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు చర్యలు తీసుకోకపోవడంతో వారంతా ఆందోళనలు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3:30 గంటల వరకు విద్యార్థినిలు నిరసనల్లో పాల్గొన్నారు. గుడివాడ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లోని అమ్మాయిల హాస్టల్ బాత్రూం లో స్పై కెమెరా లు అమర్చి - వాళ్ల వీడియో లు చిత్రీకరించి - వాటిని బాయ్స్ హాస్టల్ వాళ్లకి అమ్మి డబ్బులు తీసుకుంటున్నారు - ఇప్పటికి 300 వీడియో లు అమ్మినట్టు సమాచారం ఈ మొత్తం ప్రక్రియ ని నాల్గవ సంవంత్సరం… https://t.co/WPuHnUa0Vh pic.twitter.com/xhIuXZQnlh— 𝐀𝗋α𝗏𝗂𐓣ᑯα𝐒αꭑ𝖾𝗍α🚩 (@HarieswarH) August 30, 2024 ఈ ఘటనకు కారణమైన విజయ్ను అక్కడికి తీసుకురావడంతో అతడిపై విద్యార్థినిలు దాడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ.. వాష్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి.. వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతరం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విజయ్ను ఆసుపత్రికి తరలించారు. అలాగే, విజయ్ను విచారించిన తర్వాత.. అతడి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక, విద్యార్థినిలకు సంబంధించి దాదాపు 300 వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించినట్టు సమాచారం. 🚨 గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన.లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్‌కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్… pic.twitter.com/3rALM0f5D8— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) August 30, 2024 -
బిడ్డా... ఏడున్నావ్!
రాజంపేట: ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు... ఉన్నత విద్యను అభ్యసించాడు... క్యాంపస్ సెలక్షన్స్‌లోనే మంచి ఉద్యోగం పొందాడు... అంతలోనే అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. రెండేళ్లుగా అతను ఎక్కడ ఉన్నాడో... ఏమయ్యాడో తెలియదు. అతని కోసం 2022 జూలై నుంచి తల్లిదండ్రులు ఎదరుచూస్తూ నిత్యం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి వేదన స్థానికులను సైతం కంటతడిపెట్టిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు... అన్నమయ్య జిల్లా రాజంపేటలోని విద్యుత్‌నగర్‌కు చెందిన పైడి సుబ్రహ్మణ్యం, లక్షమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె శృతికి గత ఏడాది వివాహమైంది. కుమారుడు సు«దీర్ బెంగళూరులోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, క్యాంపస్ సెలక్షన్లో అక్కడే టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాడు. ఈ క్రమంలో అతను రెండేళ్ల కిందట అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బెంగళూరులో సు«దీర్ మిస్సింగ్ అయినట్లు కేసు నమోదు చేశారు. కానీ, ఇంతవరకు సుదీర్ జాడ తెలియలేదు.న్యూడ్ వీడియో వల్లే..! సుధీర్ వాట్సాప్‌లో న్యూడ్ వీడియో ముఠా ట్రాప్‌కు గురయ్యాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆర్ఐఎల్వైఏ ప్లస్ 1720–657–9633 నంబర్ నుంచి దుండుగులు సు«దీర్ న్యూడ్ ఫొటోను అతని అక్క శృతి ఫోన్‌కు వాట్సాప్‌లో 2022, జూలైలో పంపారు. వెంటనే శృతి తనకు వాట్సాప్ మెసేజ్ వచ్చిన నంబర్‌కు కాల్ చేయగా, స్విచ్ ఆఫ్ వచ్చింది. సు«దీర్‌కు ఫోన్ చేయగా కట్‌చేశాడు. మళ్లీ కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత ‘తమ్ముడు నువ్వు భయపడవద్దు...’ అని సుదీర్‌కు శృతి మెసేజ్ పెట్టింది. అయినా తిరిగి అతని నుంచి సమాధానం లేదు. వెంటనే శృతి తన తండ్రితో కలిసి బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధీర్ రూమ్మేట్స్ను విచారించగా, 2022 జూలై 26న ఫోన్లో మాట్లాడిన తర్వాత అతను బయటికి వెళ్లాడని, తిరిగిరాలేదని చెప్పారు. వీడియోను పంపించి బ్లాక్మెయిలర్స్ డబ్బు డిమాండ్ చేయడంతో సు«దీర్ అవమానంగా భావించి ఉంటాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయాడని అనుమానిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా రెండేళ్లుగా అతీగతీ లేకపోవడంతో తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. ఎప్పటికైనా తమ కొడుకు తిరిగివస్తాడనే ఆశతో తెలిసిన ప్రతి చోట వెతుకుతున్నారు. తమ కుమారుడు తిరిగి వస్తాడనే ఆశతో ఇన్నాళ్లు ఈ విషయాన్ని మీడియా దృష్టికి కూడా తీసుకురాలేదని సుధీర్ తల్లిదండ్రులు కన్నీటిపర్యవంతమయ్యారు. -
ఇన్నాళ్లకు ఆత్మశాంతి
సర్వకాల సర్వావస్థల యందు నీవెంటే నేనుంటానంటూ పెళ్లినాడు ప్రమాణం చేసి..భర్తతో ఏడడుగులు నడిచిన భార్యే..భర్తను హత్య చేసిన కేసులో ప్రధాన ముద్దాయిగా తేలింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను పథకం ప్రకారం హత్య చేయించిన కేసులో ప్రధాన ముద్దాయితో పాటు మరో ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.గురుగుబిల్లి/పార్వతీపురం టౌన్/వీరఘట్టం: ఉమ్మడి విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జలాశయం సమీపంలో.. నాటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని చిట్టపులివలసకు చెందిన నవవరుడు యామక గౌరీశంకరరావు 2018 మే 7న హత్యకు గురైన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో విచారణ అనంతరం ప్రధాన ముద్దాయి అయిన భార్య సరస్వతితో పాటు ప్రియుడు శివ, మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1100 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హతుడు గౌరీశంకరరావు తల్లిదండ్రులు అప్పలనాయుడు, సింహాచలమమ్మలు తమ కుమారుడి ఆత్మకు ఇన్నాళ్లకు శాంతి కలిగిందని భావోద్వేగానికి గురవుతూ స్వగ్రామం చిట్టపులివలసలో కుమారుడి చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు. ఏదిఏమైనప్పటికీ మా ఇంటి పెద్దదిక్కును కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కేసు పూర్వాపరాలు ఇలా.. అప్పటి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని చిట్టపులివలసకు చెందిన యామక అప్పలనాయుడు అదే మండలంలోని కడకెల్లకు చెందిన తన సోదరి గౌరమ్మ కూతురు సరస్వతిని చిన్నప్పటి నుంచి తానే పోషిస్తూ డిగ్రీ వరకు చదివించాడు. అనంతరం తన పెద్ద కుమారుడు గౌరీశంకరరావుకు మేనకోడలు సరస్వతిని ఇచ్చి పెద్దల సమక్షంలో 2018 ఏప్రిల్ 28న పెళ్లి చేశాడు. బీటెక్ చదివిన గౌరీశంకరరావు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులోని పవర్ ప్లాంట్‌లో పని చేసేవాడు. డిగ్రీ తర్వాత బ్యాంకు టెస్టులు రాసేందుకు 2015లో సరస్వతి విశాఖపట్నంలో కోచింగ్ తీసుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ నర్సీపట్నానికి చెందిన శివ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తరచూ ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతున్న సరస్వతి.. బావతో 2018 ఏప్రిల్ 28న తన పెళ్లి చేశారని, ఆ పెళ్లి ఇష్టం లేదని వాపోతూ భర్తను ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి పెళ్లయిన నాటి నుంచే పథకం పన్నింది. దీంతో శివ.. తన ప్రియురాలి భర్తను హతమార్చేందుకు విశాఖకు చెందిన రౌడీషీటర్ గోపీతో రూ.10 వేల నగదు, 10 తులాల బంగారం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం 2018 మే 7న తోటపల్లి జలాశయం సమీపంలోని ఐటీడీఏ పార్కు వద్ద భర్త గౌరీ శంకరరావును ప్రియుడి సాయంతో సరస్వతి హతమార్చి దుండగుల దాడిగా చిత్రీకరించింది. అయితే పోలీసుల దర్యాప్తులో ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితురాలు భార్యేనని తేలడంతో ఆమెతో పాటు ప్రియుడు శివ, మరో నలుగురు దుండగులపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపట్టారు. అప్పటినుంచి ఆరేళ్లుగా కోర్టులో నడుస్తున్న ఈ కేసు విచారణ పూర్తి కావడంతో న్యాయమూర్తి బుధవారం తుదితీర్పు చెప్పారు. ఈ కేసులో ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గొర్లి వెంకటరావు, బడే వెంకట నాయుడు వాదనలు వినిపించారు. -
పుట్టిన రోజుకు కొత్త బట్టలు తెచ్చా లే నాన్నా!
ఉరవకొండ: ‘ఆజీం లే నాన్నా.. ఈ రోజు నీ పుట్టిన రోజు.. కొత్త బట్టలు తెచ్చాం. నీ స్నేహితులు, టీచర్లకు చాక్లెట్లు పంచిపెట్టాలి’ అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. పుట్టిన దినం రోజే ఓ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఉరవకొండ పట్టణంలో జరిగింది. వివరాలు.. స్థానిక పాత మార్కెట్ సమీపంలో చాపదేవుని గుడి వద్ద నివాసముంటున్న అయ్యర్ బాబా ఫకృద్దీన్ ఉరవకొండ పోలీసు స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు భార్య హుమేరా ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఆజీంబాషా (14) సంతానం. బాలుడు ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రయివేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ఉరవకొండలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఈ క్రమంలోనే రక్త కణాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో అత్యవసరంగా అనంతపురంలోని కార్పొరేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స ఫలించక బుధవారం ఉదయం అజీంబాషా కన్నుమూశాడు. శోకసంద్రం.. : బుధవారం అజీంబాషా జన్మదినం. కుమారుడి పుట్టినరోజును ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఇప్పటికే తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. కుమా రుడికి కొత్త దుస్తులు కూడా తెచ్చారు. సంతోషంగా ఉన్న సమయంలో ఆజీంబాషా మృతితో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ఎంతో ఉల్లాసంగా, అందరితో కలివిడిగా ఉండే ఆజీంబాషా మృతితో పాత మార్కెట్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉరవకొండ రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఏఎస్ఐ గురికాల శివ, కానిస్టేబుళ్లు కులశేఖర్‌రెడ్డి, ఓబుళేసు తదితరులు సంతాపం తెలిపారు. -
రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య
మద్దికెర: ప్రేమించుకుని, కలిసి జీవించాలనుకున్న ఓ జంట... ఇంట్లో పెద్దలను ఒప్పించే ధైర్యం లేక రైలు కిందపడి అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటన కర్నూలు జిల్లా, మద్దికెర రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలివీ.. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతాప్‌సింగ్, ఉమ 20 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లుకు చేరుకొని పానీపూరి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె. కుమార్తె మీనూ(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతాప్‌సింగ్ మధ్యప్రదేశ్‌కే చెందిన కుల్దీప్ పరిహార్ (23) అనే యువకుడిని పనిలో పెట్టుకున్నాడు. మీనూ, పరిహార్ ఇద్దరూ ప్రేమించుకోవడం, విషయం ఇంట్లో తెలియడంతో పరిహార్‌ను పనిలో నుంచి తొలగించారు. గుంతకల్లులోనే ఆ యువకుడు మరోచోట పానీపూరి బండి పెట్టుకొని సొంతగా వ్యాపారం ప్రారంభించాడు. ఇటు అమ్మాయితో ప్రేమను కొనసాగించాడు. విషయం ఇంట్లో వారికి తెలిసి మరోసారి గట్టిగా మందలించడంతో భయంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి మద్దికెరకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న నోట్‌బుక్‌లో తమ చావుకు ఎవరూ కారణం కాదని, తామే చనిపోతున్నామని హిందీలో రాసి సంతకాలు చేశారు. ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పచ్చ బ్యాచ్ అరాచకం.. వైఎస్సార్సీపీ మహిళా నేతను చంపేస్తామంటూ బెదిరింపులు!
👉ఏపీలో టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పచ్చ బ్యాచ్ అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది. తాజాగా ఎల్లో బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది..👉వైఎస్సార్ జిల్లాలో టీడీపీ ‘చెత్త’ రాజకీయాలకు తెర లేపింది. తన ఇంటి ముందు చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. మేయర్‌తో పాటుగా ఏకంగా 14 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారు పోలీసులు. దీంతో, తమపై కేసులు పెట్టడంతో పోలీసులను పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.👉మరోవైపు.. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ మహిళా సర్పంచ్ చాందినిని టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేశారు. వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ పచ్చ బ్యాచ్ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ నేపథ్యంలో ప్రాణ భయంతో సర్పంచ్ చాందిని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్ కడప ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా @JaiTDP ఎమ్మెల్యే మాధవి రెడ్డి? 30 ఏళ్లుగా ఎప్పుడూ జరగని అరాచకాలు గత 3 నెలల నుంచి జరుగుతున్నాయి రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? -సురేష్ బాబు గారు, కడప మేయర్ pic.twitter.com/LQRVfymgmA— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 టీవీలో చూపిస్తానంటూ టీడీపీ వాళ్లని రెచ్చగొట్టిన బిగ్ టీవీ జర్నలిస్ట్ ప్లాన్ ప్రకారం కడప మేయర్ సురేశ్ ఇంటి ముందు చెత్త వేసిన @JaiTDP నేతలు ఎమ్మెల్యే మాధవి రెడ్డి డైరెక్షన్లో సైగలతో ప్లాన్ అమలు చేసిన బిగ్ టీవీ జర్నలిస్ట్ప్రశాంతంగా ఉన్న వైయస్ఆర్ కడపలో మళ్లీ ఫ్యాక్షన్ బీజం… pic.twitter.com/1FqzgCVPvv— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
కొట్టేసిన బంగారం విలువ మినహా మిగతా డబ్బు ఇచ్చేయండి!
సాక్షి, అమరావతి: పదవీ విరమణకు ముందు ఖాతాదారుని లాకరు నుంచి బంగారం చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్న యూనియన్ బ్యాంకు ఉద్యోగికి చోరీకి గురైన బంగారం విలువ మినహా మిగతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆయనపై శాఖాపరమైన విచారణ మూడు నెలల్లో ముగించాలని, ఆలోగా ముగియకపోతే నిలిపివేసిన సొమ్మునూ ఇచ్చేయాలని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది.పల్నాడు జిల్లా నర్సరావుపేట యూనియన్ బ్యాంకులో 2019 మార్చి 5న ఓ ఖాతాదారుడి లాకర్ నుంచి బంగారం సంచి మాయమైంది. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన బ్యాంకు అధికారులు ఆ బంగారాన్ని ఆ శాఖ ఉద్యోగి నాయక్ చోరీ చేశారని నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాయక్‌పై కేసు నమోదు చేశారు. అదే నెల 31న నాయక్ పదవీ విరమణ చేశారు. ఆ ఏడాది డిసెంబరు 3న బ్యాంకు అధికారులు నాయక్‌పై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.పదవీ విరమణ అనంతరం నాయక్‌కు రావాలి్సన రిటైర్మెంట్ ప్రయోజనాల డబ్బు ఆయన ఖాతాలో జమ చేసినప్పటికీ, క్రిమినల్ కేసు, శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండటంతో వాటిని బ్యాంకు అధికారులు జప్తు చేశారు. ప్రొవిజినల్ పెన్షన్ మినహా మిగిలిన ప్రయోజనాలని్నంటినీ నిలిపేశారు. ఖాతాల జప్తుపై నాయక్ 2022లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బంగారం చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు సమాచారం ఆధారంగా కేసు పెట్టారని తెలిపారు. సింగిల్ జడ్జి బ్యాంకు వాదనను కూడా విన్నారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉన్న నెపంతో పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఆయనకు రావాలి్సన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ విడుదల చేయాలని బ్యాంకు యజమాన్యాన్ని ఆదేశించారు.సింగిల్ జడ్జి ఆదేశాలపై యూనియన్ బ్యాంకు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. యూనియన్ బ్యాంకు తరఫు సీనియర్ న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనరసింహ వాదనలు వినిపిస్తూ.. శాఖాపరమైన విచారణ పూర్తయ్యేంత వరకు ఆ వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలను ఆపే అధికారం తమకుందన్నారు.ఆ ఉద్యోగి బంగారం కాజేయడం వల్ల బ్యాంకుకు ఎంత నష్టం వాటిల్లిందని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ.4.42 లక్షలు నష్టం వాటిల్లిందని లక్ష్మీనరసింహ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నాయక్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను నిలిపేయడాన్ని, బ్యాంకు ఖాతాల జప్తును తప్పుపట్టింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.4.42 లక్షలు మినహా మిగతా సొమ్మంతా విడుదల చేయాలని, బ్యాంకు ఖాతాల నిర్వహణకు నాయక్‌కు అనుమతినివ్వాలని బ్యాంకును ఆదేశించింది. శాఖాపరమైన విచారణకు సహకరించాలని నాయక్‌ను ఆదేశించింది.