mock drill
-
యాక్షన్ ప్లాన్‌తో రెడీగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్ అధికారులు సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ‘పరిస్థితిని బట్టి 24 గంటల ముందే ప్రజలను అప్రమత్తం చేసి మాక్ డ్రిల్, ట్రయల్ వంటివి నిర్వహించాలి. హైదరాబాద్‌లో సైరన్ అలర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన పరికరాలు ఎక్కడున్నా కొనుగోలు చేయాలి. ప్రజల్లో జాతీయ వాదాన్ని పెంపొందించడానికి వీలుగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని వర్గాల ప్రజలతో సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలి..’అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గురువారం నిర్వహించిన సంఘీభావ ర్యాలీ సమాజానికి మంచి సంకేతాన్ని ఇచ్చిదని అన్నారు. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సు«దీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి పలు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కట్టడి చేయాలి ‘అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దుచేయాలి. వార్తా ప్రసారాల్లో తగు జాగ్రత్తల కోసం మీడియా అధిపతులతో సమావేశం నిర్వహించాలి. సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ కట్టడి చేయాలి. తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలి..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆసుపత్రి భవనాల శ్లాబులపై ఎరుపు రంగుతో ప్లస్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ అన్ని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని వివరించారు. నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్: డీజీపీ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భద్రత పెంచినట్లు చెప్పారు. రక్షణ రంగానికి చెందిన సంస్థల వద్ద 24 గంటల పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, సీసీటీవీలతో మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి పర్యవేక్షించడానికి హెదరాబాద్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రత్యేకంగా యాప్ రూపొందించారని, అలాంటి యాప్ రాష్ట్రంలో తీసుకురావడంపై ఆలోచన చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. -
మాక్‌డ్రిల్స్.. వెల్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ యుద్ధ సన్నద్ధత నేపథ్యంలో పౌరులను అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపట్టింది. దేశ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం సందర్భంగా ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేలా, వైమానిక దాడులు జరిగినప్పుడు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తూ కేంద్రం ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు నగరంలోని నాలుగు ప్రాంతాల్లో మాక్‌డ్రిల్స్ చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన మాక్‌డ్రిల్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఆద్యంతం ఉత్కంఠగా.. గోల్కొండ: గోల్కొండ ఆరి్టలరీ సెంటర్ ఆధ్వర్యంలో నానల్‌నగర్ అవలాన్ కాంప్లెక్స్ వద్ద డీఎఫ్ఓ జై కృష్ణ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతకుముందు అవలాన్ కంప్లెక్స్కు దారి తీసే అన్ని రోడ్లను మిలిటరీ, స్థానిక పోలీసులు దిగ్బంధనం చేశారు. అరగంట పాటు రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. అవలాన్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఈ మాక్ డ్రిల్‌ను ప్రజలు ఉత్కంఠగా తిలకించారు. రియల్ లైఫ్‌లో మొదటిసారి సైన్యం మెరుపుదాడులు, సాహసోపేత సైన్య విన్యాసాలను చూసి ఆశ్చర్య చకితులయ్యారు. మరోవైపు శత్రు స్థావరాలపై దాడులు చేయడం, తమకు తాము ఏ విధంగా రక్షించుకోవడం లాంటి సైనికుల విన్యాసాలు వారి ధైర్య సాహసాలను ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు. సుమారు 29 నిమిషాల పాటు జరిగిన మాక్ డ్రిల్ దేశరక్షణ, శత్రు నిర్మూలన తదితరాలపై సైనికుల ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మరో వైపు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నిశ్శబ్దం ఆవహించింది. కొందరు తమ ఇళ్లలోని విద్యుత్ కనెక్షన్లను ఆఫ్ చేయగా మరికొందరు మాక్ డ్రిల్ సూచనలను పాటిస్తూ ఎల్రక్టానిక్ పరికరాలు, ఎల్పీజీ గ్యాస్ స్వీచ్‌లను ఆఫ్ చేశారు. మే ఫ్లవర్లో సైరన్ల మోత.. ఉప్పల్/మల్లాపూర్: ఉప్పల్ మల్లాపూర్ మే ఫ్లవర్ అపార్టుమెంట్లో బాంబుల మోత.. స్థానికులంతా ఉలిక్కి పడ్డారు. అపార్టుమెంట్ వాసులు ఎక్కడికక్కడ తలుపులు వేసుకున్నారు. లైట్లు బంద్ చేశారు. సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. చెలరేగిన మంటలు.. ఫైరింజిన్లు.. అంబులెన్స్‌లు.. వైద్య బృందం, పోలీసులు డీఆర్ఎఫ్ బలగాలు, ఆర్మీ సిబ్బంది.. ఉరుకులు.. పరుగులు.. క్షతగాత్రుల తరలింపు.. ఇలా మాక్‌డ్రిల్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. యుద్ధ సమయాల్లో అనుకోని విపత్తు వస్తే అపార్టుమెంట్లో నుంచి ఎక్కడ నుంచి బయట పడవచ్చు లాంటి అంశాలను మాక్‌డ్రిల్‌లో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మాక్‌డ్రిల్‌లో మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టర్ గౌతం పొత్రూ, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ చక్రపాణి, జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి, బీజేఈ అధికారి ప్రసన్న కుమార్, ఏడీఎఫ్‌ఎస్ ఫైర్ సరీ్వస్ అధికారి వి. శ్రీనివాస్, హైడ్రా అధికారి పాపయ్యతో పాటు 150 మంది ఎన్సీసీ విద్యార్థులు, 70 మంది పోలీస్ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. బాల్కనీల నుంచి భయాందోళనతో.. సంతో‹Ùనగర్: ఐఎస్ సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ట్విన్ సిటీస్ బీపీఎస్‌లో బుధవారం సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, అగి్నమాపక శాఖ రీజినల్ ఫైర్ ఆఫీసర్ హరినాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. ట్విన్ సిటీస్ టవర్స్‌లో ఒక్కసారిగా బాంబులు పేలడంతో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనతో బాల్కనీల నుంచి తమను కాపాడాలంటూ అరుపులు, కేకలు వేయడంతో స్థానిక పోలీసులు, అగి్నమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాంబు దాడిలో తీవ్ర గాయాలకు గురైన క్షతగాత్రులను ఒక్కొక్కరిని అగి్నమాపక శాఖకు చెందిన భారీ నిచ్చెనల ద్వారా జాగ్రత్తగా కిందికి దించడం... వారిని అంబులెన్స్ సహాయంతో వైద్య చికిత్సల నిమిత్తం కంచన్‌బాగ్ అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన అపార్ట్మెంట్లో ఉన్న బా«ధితులను ప్రత్యేక వాహనాలలో కేంద్రీయ విద్యాలయానికి తరలించారు. ఆ తర్వాత ఇదంతా మాక్‌డ్రిల్‌లో భాగమేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. మాక్ డ్రిల్‌లో హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ ముకుంద్ రెడ్డి, ఆర్డీఓ రామకృష్ణ, సౌత్ జోన్ డీసీపీ అశోక్, సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ, జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న, మురళీమోహన్ రెడ్డి, సౌత్, ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ రఘు, ట్రాఫిక్ డీసీపీ–2 అశోక్ కుమార్, డీసీపీ–3 ఆర్.వెంకటేశ్వర్లు, సౌత్, ఈస్ట్ జోన్ ఏసీపీ వి.చంద్ర కుమార్, వైద్యశాఖ డిప్యూటీ డీఎంహెచ్ఓ బిర్జీస్ ఉన్నీసా, మొత్తం 12 విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అంతటా అప్రమత్తం.. కంటోన్మెంట్: ఈస్ట్‌మారేడుపల్లి మన్భుమ్ అపార్ట్మెంట్ ఆవరణలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో వివిధ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం 4.15 గంటలకు అపార్ట్మెంట్ ముందు ఓ బాంబు పేలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకున్నారు. రెండు ప్రత్యేక ఫైర్ ఇంజిన్లు అపార్ట్మెంట్ వద్దకు వచ్చాయి. ఇంతలోనే ఎన్సీసీ క్యాడెట్లు పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ సిబ్బంది పరుగు పరుగున అపార్ట్మెంట్లోకి చేరిపోయారు. క్షతగాత్రులను ఒక్కొక్కరిగా స్ట్రెచర్లు, వీల్చైర్లపై కిందకు తీసుకొచ్చారు. అప్పటికే అపార్ట్మెంట్ ఎదుటకు చేరుకున్న అంబులెన్స్‌లలోకి వారిని చేర్చి ఆసుపత్రికి తరలించారు. నిజంగా ఏదైనా ఆపద సంభవిస్తే ఎలా స్పందించాలో వివరిస్తూ చేసిన మాక్‌డ్రిల్ ఎంతగానో ఉపకరిస్తుందని ఆయా శాఖల సిబ్బంది పేర్కొన్నారు. మారేడుపల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్‌ను నార్త్‌జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, ఫైర్ సేప్టీ ఆఫీసర్ శ్రీధర్, కంటోన్మెంట్ శానిటరీ సూపరింటెండెంట్ మహేందర్ పరిశీలించారు. సికింద్రాబాద్ స్టేషన్లో అలర్ట్ సికింద్రాబాద్: పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతను మూడింతలు పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల విషయంలో రెట్టించిన అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 50 మందికి ఒక బృందం చొప్పున మూడు బృందాలకు చెందిన 150 మంది రైల్వే రక్షణ ప్రత్యేక దళం (ఆర్పీఎస్ఎఫ్) పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మోహరించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇప్పటికే 100 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. 100 మంది ప్రత్యేక ఆర్పీఎఫ్ పోలీసులు మూడు షిఫ్టుల్లో (24 గంటలు) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పహారా కాస్తున్నారు. మరో 50 మంది పోలీసులు మొబైల్ టీంలుగా ఏర్పడి సేటషన్ పరిసరాల్లో గస్తీ నిర్వహించడంతోపాటు, స్టేషన్‌కు వచి్చవెళ్లే వ్యక్తులపై నిఘా వేస్తున్నారు. జీఆర్పీ పోలీసుల సహకారంతో ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న అన్ని రైళ్లలోనూ రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల వెయిటింగ్ హాళ్లు, పది ప్లాట్‌ఫామ్‌లలో సంచరించే వ్యక్తుల లగేజీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరికొందరు పోలీసులను మఫ్టీలో ఉంచి గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు వేచి ఉండే గదులు, ప్రవేశమార్గాల పరిస్థితులను సీసీ కెమెరాల ద్వారా వీక్షిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించిన సందర్భాల్లో మొబైల్ ద్వారా రైల్వే కంట్రోల్ రూం (హెల్ప్‌లైన్) 139 నంబరు ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ఆరు ప్రాంతాల్లో సెక్యూరిటీ రిహార్సల్స్ సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని నాలుగు ప్రాంతాల్లో బుధవారం ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్స్ నిర్వహించగా... ఆరు కీలక, సున్నిత ప్రాంతాల్లో సెక్యూరిటీ రిహార్సల్స్ జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిఘా వర్గాలు ఈ సంస్థల్ని ఎంపిక చేశాయి. ఈ ఆరూ రక్షణ శాఖకు సంబంధించివే కావడం గమనార్హం. సికింద్రాబాద్, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, బోయిన్పల్లిల్లో ఉన్న కంటోన్మెంట్లతో పాటు మెహిదీపట్నం, గోల్కొండల్లో ఉన్న గారిసన్ ప్రాంతాలను సెక్యూరిటీ రిహార్సల్స్ కోసం రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మంగళవారమే డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఈ రిహార్సల్స్‌లో భద్రత బలగాలతో పాటు పోలీసు విభాగం నుంచి ఏసీపీ ర్యాంకు అధికారి, ఆక్టోపస్ కమాండోలు పాల్గొన్నాయి. ఈ సెక్యూరిటీ రిహార్సల్స్ నిర్వహణ కోసం హైదరాబాద్ పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఏసీపీలను కేటాయించారు. ఎలా జాగ్రత్తపడాలో బోధపడింది.. అత్యవసర సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనేది మాక్ డ్రిల్‌తో అర్థమైంది. మే ఫ్లవర్ గ్రాండ్ అపార్ట్మెంట్లో 370 ప్లాట్లు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రెండుసార్లు ట్రయల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అపార్ట్మెంట్ మొత్తం మాక్‌డ్రిల్‌లో భాగస్వాములు అయ్యారు. – బీవీ రావు, మల్లాపూర్, మే ప్లవర్ గ్రాండ్ అధ్యక్షుడు కళ్లకు కట్టినట్లు చూపించారు బాంబులు పేలినప్పుడు, ఉగ్రవాదులు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి, బాంబులు పేలి్చనప్పుడు సీన్ఎలా ఉంటుందో అచ్చం అలాగే మాక్‌డ్రిల్‌తో అవగాహన కలి్పంచారు. మహిళలు, చిన్నారులు ఎలా జాగ్రత్త పడాలో మాక్‌డ్రిల్‌తో అవగాహన కలిగింది. – జ్యోతి రాణి. మే ఫ్లవర్ అపార్ట్మెంట్ వాసిఎన్నో అంశాలు తెలిశాయి.. అనుకొని విపత్తు సంభవించినప్పుడు మనం ఎలా బయట పడాలి, ఆపదలో ఉన్న వారిని సైతం ఎలా గట్టేకించాలనే అంశాలు బోధపడ్డాయి. ముఖ్యంగా యుద్ధ సమయాల్లో ఎటాక్ జరిగినప్పుడు ఎలా మెలగాలో చూపించారు. మాక్‌డ్రిల్ వల్ల మాలో భయం కూడా పోయింది. – మల్లేష్, మే ఫ్లవర్ అపార్టుమెంట్ వాసి -
హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ మాక్ డ్రిల్ (ఫొటోలు)
-
ఢిల్లీలో కరెంట్ కట్.. ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే..?
ఢిల్లీ: సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌లో భాగంగా నగరంలో ఇవాళ రాత్రి 8 నుంచి 8.15 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ప్రజలంతా సహకరించాలని న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. అయితే, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రాష్ట్రపతి భవన్, పీఎంవో, మెట్రో స్టేషన్లు, ఇతర ముఖ్య ప్రదేశాలకు ఇది వర్తించదని ఎన్డీఎంసీ వెల్లడించింది.పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. ఈ అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరిగాయి. దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది.వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్‌కు వేదికయ్యాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్ డ్రిల్స్ జరిగాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి. 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ ఉన్నాయి. -
యుద్ధానికి సిద్ధం.. విశాఖలో మాక్ డ్రిల్
-
దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్
అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. దేశవ్యాప్తంగా సివిల్ డిపెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు నిర్వహించారు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట ఈ డ్రిల్స్ జరిగాయి. మాక్ డ్రిల్స్‌లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు వినిపించాయి.👉హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉సికింద్రాబాద్, గోల్గొండ, కంచన్‌బాగ్ డీఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్👉విశాఖ వన్ టౌన్లో మాక్ డ్రిల్👉వైమానిక దాడులపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్👉ఎక్కడెక్కడ జరిగాయంటే..దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్‌డ్రిల్స్ జరిగాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి. 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ ఉన్నాయి.మాక్‌డ్రిల్ వల్ల ప్రజలు ఎవరూ భయపడొద్దు: సీవీ ఆనంద్సైరన్ మోగగానే ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలిఇళ్లలో ఉన్నవాళ్లు ఇళ్లలోనే ఉండాలిబయట ఉన్నవాళ్లు సమీప భవనాల్లోకి వెళ్లాలి👉ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.👉ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పై సీఎం సమీక్ష నిర్వహించారు.👉ఆపరేషన్ అభ్యాస్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.👉జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో మరికాసేపట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నాం👉సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అలర్ట్ చేస్తాం.👉4 గంటలకు సైరన్ మోగగానే మాక్ డ్రిల్ ప్రారంభమవుతుంది.👉హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ నిర్వహణ👉సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు మాక్ డ్రిల్👉హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉సికింద్రాబాద్, గోల్గొండ,కంచబాగ్ డీఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్ 👉మోగనున్న పోలీస్ సైరన్, ఇండస్ట్రియల్ సైరన్లు -
Mock drill: తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ జరిగే ప్రాంతాలు ఇవే.. చూసేయండి!
ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ముఖ్య ప్రదేశాలలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో అన్నీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది.ఈ మాక్ డ్రిల్‌పై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నీ రాష్ట్రాల సెక్రటరీలు,డీజీపీలు,ఫైర్ డీజీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ ప్రాంతాల్లో ఎలా మాక్ డ్రిల్ నిర్వహించాలో ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలు మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ , తారాపూర్ అణు కేంద్రంకేటగిరి 2 లో విశాఖపట్నం, హైదరాబాద్ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో ఏ కేటగిరిలో ఢిల్లీ ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. 1. అండమాన్ & నికోబార్ ద్వీపాలు Category-II: పోర్ట్ బ్లెయిర్2. ఆంధ్ర ప్రదేశ్Category-II: హైదరాబాద్, విశాఖపట్నం3. అరుణాచల్ ప్రదేశ్ Category-II: • ఆలోగ్ (వెస్ట్ సియాంగ్) • ఇటనగర్ • తవాంగ్ • హయులింగ్ • Category-III: బొమ్డిలా4. అస్సాం Category-II: • బోంగైగావోన్ • డిబ్రూగఢ్ • ధుబ్రి • గోల్పారా • జోర్హాట్ • శిబ్‌సాగర్ • టిన్సుకియా • తేజ్‌పూర్ • డిగ్బోయ్ • దిలీజన్ • గువహాటి (డిస్పూర్) • రంగియా • నమ్రుప్ • నజీరా • నార్త్-లక్ష…26.ఒరిస్సా (ఒడిశా)Category-II: • టాల్చర్ Category-III: • బలాసోర్ • కోరాపుట్ • భువనేశ్వర్ • గోపాల్పూర్ • హిరాకుడ • పారాదీప్ • రౌర్కెలా • భద్రక్ • ధేంకనాల్ • జగత్సింగ్పూర్ • కేండ్రాపాడా27. పుదుచ్చేరి Category-II:పుదుచ్చేరి28. పంజాబ్Category-II: • అమృత్సర్ • భటిండా • ఫిరోజ్‌పూర్ • గుర్దాస్పూర్ • హోషియార్పూర్ • జలంధర్ • లుధియానా • పటియాలా • పఠాన్‌కోట్ • అడాంపూర్ • బర్ణాలా • భాఖ్రా-నంగళ్ • హల్వారా • కొఠ్‌కాపూర్ • బటాలా • మోహాలి (ససనగర్) • అబోహర్Category-III: • ఫరీద్పూర్ • రోపర్ • సంగ్రూర్29. రాజస్థాన్Category-II: • కోటా • రావత్భాటా • అజ్మీర్ • అల్వార్ • బార్మేర్ • భరత్పూర్ • బీకానేర్ • బుండీ • గంగానగర్ • హనుమాన్‌గఢ్ • జైపూర్ • జైసల్మేర్ • జోధ్‌పూర్ • ఉదయ్‌పూర్ • సికార్ • నాల్ • సూరత్‌గఢ్ • అబూ రోడ్ • నసీరాబాద్ (అజ్మీర్) • భివారీ Category-III: • ఫులేరా (జైపూర్) • నాగౌర్ (మెర్టా రోడ్) • జాలోర్ • బేవార్ (అజ్మీర్) • లాల్‌గఢ్ (గంగానగర్) • సవాయ్ మాధోపూర్ • పాలి • భిల్వారా👉రేపటి మాక్ డ్రిల్ సందర్భంగా ఎదురయ్యే పరిణామాలుఎలక్ట్రిసిటీ బ్లాక్ అవుట్మొబైల్ సిగ్నల్స్ నిలిపివేతట్రాఫిక్ దారి మళ్లింపుప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలుపబ్లిక్ అనౌన్స్మెంట్స్👉యుద్ధం తరహా ఎమర్జెన్సీలో పోలీసులు, పారా మిలిటరీ వ్యవహరించే విధానంసివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ సందర్భంగా ప్రజలు వ్యవహరించాల్సిన విధానంఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండడం. స్థానిక గా ఇచ్చే సూచనలు పాటించాలివదంతులను వ్యాపింప చేయొద్దు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మవద్దుకరెంటు లేక పోయినా, ఇంటర్నెట్ పనిచేయకపోయినా ఆందోళనకు గురికావద్దు అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ చానల్స్, రేడియోను మాత్రమే వినాలిప్రజలు, అధికారులు తమ తమ బాధ్యతలు గుర్తెరిగి మెలగాలిమార్క్ డ్రిల్స్ కేవలం ప్రజల సన్నద్ధత కోసమే తప్ప... ఆందోళన కు గురిచేయడం లక్ష్యం కాదు 👉రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే...ఎయిర్ రైడ్ సైరన్స్ : ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్షిత ప్రదేశాలకి వెళ్ళాలిక్రాష్ బ్లాక్ ఔట్స్: నగరాలలో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ అమలు. 1971 యుద్ధ సమయంలో బ్లాక్కౌట్ ఎత్తుగడను ఉపయోగించిన భారత్ కీలక సంస్థలు, ప్రాజెక్టుల రక్షణ: కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్ ను గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు తరలింపు చర్యలు: హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం , లాజిస్టిక్స్ ఇష్యూస్ ను గుర్తించడం పౌరులకు శిక్షణ: పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో శిక్షణ. సురక్షిత ప్రాంతాలను గుర్తించడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా, ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండడం అంశాలపై శిక్షణ -
Mock drills: భారత్‌లో మాక్ డ్రిల్.. 1971భారత్-పాక్ యుద్ధ సమయంలో
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. అదే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ను బుధవారం (మే7న) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. సోమవారం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.అయితే, మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత్ - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు కేంద్రం హోం శాఖ సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. Ministry of Home Affairs has asked several states to conduct mock drills for effective civil defence on 7th May.Following measures will be undertaken1.Operationalization of Air Raid Warning Sirens2. Training of civilians, students, etc, on the civil defence aspects to… pic.twitter.com/DDvkZQZw3A— DD News (@DDNewslive) May 5, 2025శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది. గత ఆదివారం ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. బ్లాక్ ఔట్ రిహార్సల్స్ భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు. -
తిరుమలలో భద్రతా దళాల మాక్ డ్రిల్ (ఫొటోలు)
-
సింహాచలం రైల్వే స్టేషన్లో రైలు ప్రమాద మాక్‌డ్రిల్ (ఫొటోలు)
-
BHEL కంపెనీ దగ్గర ఉద్రిక్త వాతావరణం.. ఆక్టోపస్ దళాల హంగామాతో ప్రజల్లో భయం
-
కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అప్రమత్తంగా ఉండాల్సిందే!
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండంటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గతవారం దీనిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఇందులో భాగంగానే అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో సౌకర్యాలపై ఈ రోజు (సోమవారం), రేపు (మంగళవారం) దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానాలోని ఝజ్జర్ ఎయిమ్స్‌లో మాండవియా మాక్‌డ్రిల్‌ను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మాండవియా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల కరోనా కేసులు గణనీయంగా పెరుతున్నాయని అన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు. అంతేగాదు ఆస్పత్రిలో సంరక్షణ ఏర్పాట్లు, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని కూడా తెలిపారు. అలాగే పెరుగుతున్న ఈ కేసుల దృష్ట్యా కరోనా నాలుగో వేవ్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చివరి కోవిడ్ మ్యూటేషన్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7, ఇప్పుడు వస్తున్న మరో వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16 వంటి కారణంగానే కేసులు పెరుగుతున్నాయన్నారు. ఐతే ఈ ఉప వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కాదని చెప్పారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా 'టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్' అనే కోవిడ్ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించిన ఫైవ్ ఫోల్డ్ స్ట్రాటజీ సిద్దంగా ఉందని చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశంలో చాలా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాల్లో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయడమేగాక మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది కేంద్రం. ముందుజాగ్రత్తగా హర్యానా, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలుబహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. అలాగే హర్యానలోని పాఠశాలల్లో కూడా మాస్క్‌లు తప్పనిసరి చేయడమే గాక ఉత్తరప్రదేశ్‌లో 'అధిక ప్రాధాన్యత' పేరుతో విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులను స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా అధికారులను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. (చదవండి: మహారాష్ట్ర ఆలయంలో విషాదం..చెట్టుకూలి ఏడుగురు మృతి) -
10, 11 తేదీల్లో ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్
సాక్షి, హైదరాబాద్: దేశ విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ఆసుపత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10, 11 తేదీల్లో కోవిడ్ నియంత్రణ ఏర్పాట్లపై పరిశీలన చేసే నిమిత్తం మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు గురువారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. వార్డుల్లో పడకలు, ఆక్సిజన్ వసతి, ఐసీయూలు, టెస్టింగ్ కిట్ల నిల్వ, మందులు వంటి వాటిపై ఈ డ్రిల్ ఉంటుంది. అన్ని రకాల వసతులు ఉన్నాయో లేదో మాక్ డ్రిల్‌లో పరిశీలించి, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సరిదిద్దుతారు. కావాల్సిన సదుపాయాలు సమకూర్చుతారు. మిషన్లు, పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ప్లాంట్లు తదితర వాటి పనితీరును పరిశీలిస్తారు. మాక్ డ్రిల్ కోసం ప్రతి జిల్లాకు ఒక నోడల్ఆఫీసర్ను నియమిస్తారు. మాక్ డ్రిల్‌లో ఏం చేస్తారంటే.. అన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లతో పాటు వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి అనేది తనిఖీ చేస్తారు. దీంతో పాటు ఆయా ఆసుపత్రులు, అనుబంధ కేంద్రాల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఆశాలు, అంగన్వాడీలు ఎంత మంది ఉన్నా రు? అనే వివరాలు సేకరిస్తారు. కరోనా నియంత్రణకు శిక్షణ కలిగిన సిబ్బంది ఉన్నారా? లేదా? అనే వివరాలను కూడా సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటారు. దీంతోపాటు అంబులెన్స్‌లు ఎన్ని ఉన్నాయి? వాటి పరిస్థితిఎలా ఉంది? అనే అంశాలను తనిఖీ చేస్తారు. కాగా, మాక్‌డ్రిల్ నివేదికను జిల్లా వైద్యాధికారులు తప్పనిసరిగా ఆన్లైన్లో నమో దు చేయాలని శ్రీనివాసరావు ఆదేశించారు. -
కరోనా నియంత్రణకు సన్నద్ధం
సాక్షి, అమరావతి: చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కరోనా నియంత్రణపై రాష్ట్ర వైద్యశాఖ ముందుజాగ్రత్త చర్యలను ప్రారంభించింది. ఇదే క్రమంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. మాక్‌డ్రిల్ నిర్వహణ, కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలకు వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది. కరోనా కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలు, నియంత్రణ కోసం చేయాల్సిన ఏర్పాట్లు, సన్నద్ధతపై సమీక్షించుకోవడమే ఈ మాక్ డ్రిల్ నిర్వహణ ముఖ్య ఉద్దేశం. మాక్ డ్రిల్‌లో భాగంగా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఆస్పత్రులు ఉన్నాయా.. లేదా.. అని పరిశీలిస్తారు. ఆయా ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ పడకల సామర్థ్యం, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్‌లలో కరోనా పరీక్షల సామర్థ్యం, ఆర్టీపీసీఆర్, ఆర్ఏటీ కిట్స్, పరీక్షల నిర్వహణకు అవసరమైన రీఏజెంట్స్ సరిపడా అందుబాటులో ఉన్నాయా.. లేదా.. అని చూస్తారు. తప్పనిసరి మందులు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లు, ఇతర మందులు, సర్జికల్స్ నిల్వలను పరిశీలిస్తారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్లు, సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థ గురించి తెలుసుకుంటారు. ఆక్సిజన్ నాణ్యత, పైప్‌లైన్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూస్తారు. జీనోమ్ ల్యాబ్‌కు విదేశీ ప్రయాణికులకు నమూనాలు ప్రతి అంతర్జాతీయ విమానంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న జిల్లాల డీఎంహెచ్‌వోలకు సోమవారం వైద్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నమూనాలను విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపాలని ఆదేశించింది. ర్యాండమ్ పరీక్షల నుంచి 12ఏళ్లలోపు పిల్లలను మినహాయించింది. రాష్ట్రంలోని గన్నవరం, విశాఖపట్నం, రేణిగుంట, కర్నూల్, కడప, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులలో ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీచేసింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను కరోనా నిబంధనలకు అనుగుణంగా ఐసోలేషన్‌లో ఉంచాలంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసి వచ్చిన వారికి కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రిని సంప్రదించాలని, లేదా 104కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి సలహాలు, సూచనలు తీసుకోవాలని తెలిపింది. -
AU Vizag-Mock Drill: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి ఉగ్రవాదులు!
విశాఖపట్నం: మంగళవారం రాత్రి 9 గంటలు.. ఆయుధాలు ధరించిన ఐదుగురు ఉగ్రవాదులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి చొరబడ్డారు. జిహాద్ అంటూ మెయిన్‌గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేసి లోపలకు ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఉగ్రవాదులు ఏయూ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు భయాందోళనకు గురై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆక్టోపస్ బృందానికి సమాచారం చేరవేశారు. ఆక్టోపస్ బృందాలు వెంటనే అప్రమత్తమై.. ఏయూ ప్రాంగణానికి చేరుకున్నాయి. ఆక్టోపస్ బృంద సభ్యులు కొంత సేపు సమాలోచనలు జరిపారు. ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతం, భవనం పరిసరాలు, లోపలకు వెళ్లే మార్గాలు, లోపల పరిస్థితులు తదితర అంశాలపై ప్రాథమికంగా అవగాహన ఏర్పరుచుకుని.. ఐదుగు రు సభ్యులు ఒక బృందంగా ఏర్పడ్డారు. ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కొంత మంది ఆక్టోపస్ స్నైపర్ సభ్యులు భవనాలపైకి చేరుకుని మాటువేశారు. మరోవైపు ఆక్టోపస్ బృందాలు లోపలకు ప్రవేశించి ప్రతీ గదిని తనిఖీ చేశారు. ఉగ్రవాదులు ఎవరినైనా బంధించారా లేదా పరిశీలించారు. బాంబులను నిరీ్వర్యం చేసే బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ ఆపరేషన్ అర్ధరాత్రి దాటి సాగింది. చివరకు ఇరువర్గాల మధ్య దాడుల అనంతరం ఆక్టోపస్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో ఆక్టోపస్ బృందాలు అత్యాధునిక ఆయుధాలు వినియోగించారు. ఇదంతా నిజమే అనుకుంటే పొరపాటే! విపత్కర సమయాల్లో రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేయడానికి ఆక్టోపస్ నిర్వహించిన మాక్‌డ్రిల్ ఇది. ఆపరేషన్ పైతాన్ పేరుతో స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన మాక్‌డ్రిల్ విజయవంతంగా ముగిసింది. -
రష్యా అణు యుద్ధ సన్నద్ధత! డ్రిల్స్‌ను స్వయంగా పరిశీలించిన పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయిలో పైచేయి సాధించడమే లక్ష్యంగా రష్యా అధినేత పుతిన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. బుధవారం తమ సైనికుల యుద్ధ సన్నద్ధతను ఆయన పుతిన్ స్వయంగా పరిశీలించారు. రష్యా వ్యూహాత్మక అణు దళాలు బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లతో డ్రిల్స్ నిర్వహించాయి. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల ప్రయోగానికి రష్యా సేనలు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ డ్రిల్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవేళ తమ దేశంపై అణు దాడి జరిగితే గట్టిగా తిప్పికొట్టాలన్నదే తమ ఉద్దేశమని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు చెప్పారు. తాజాగా ఎక్సర్సైజ్లో భాగంగా ఉత్తర ప్లెసెట్స్క్ లాంచ్ సైట్ నుంచి ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. కామ్చాట్కా ద్వీపంలో అణు జలాంతర్గామి ద్వారా సినేవా ఐసీబీఎం క్షిపణిని పరీక్షించారు. అలాగే టూ–95 స్ట్రాటజిక్ బాంబర్ల సాయంతో క్రూయిజ్ క్షిపణులను ఫైర్టెస్టు చేశారు. అన్ని క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు నాటో కూటమి ఉత్తర యూరప్ ప్రాంతంలో వార్షిక మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ నెల 30 దాకా ఈ విన్యాసాలు కొనసాగుతాయి. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అమెరికాకు చెందిన లాంగ్–రేంజ్ బి–52 బాంబర్లు సైతం ఇందులో పాల్గొంటున్నాయి. పరిస్థితి చెయ్యి దాటితే అణ్వస్త్రాల ప్రయోగానికి వెనుకాడబోమని పుతిన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. 40 గ్రామాలపై రష్యా దాడులు కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఉక్రెయిన్‌లోని 40 గ్రామాలపై దాడులు చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. దాడుల భయంతో జనం రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెలిపారు. రష్యా సైన్యం ఐదు రాకెట్లు ప్రయోగించిందని, 30 వైమానిక దాడులు, 100కుపైగా మల్టిపుల్–లాంచ్ రాకెట్ సిస్టమ్ దాడులు చేసిందని ఉక్రెయిన్ సైనిక దళాల జనరల్ స్టాఫ్ పేర్కొన్నారు. "We are aware of Ukraine's plans to use a dirty bomb," Putin 🤡 pic.twitter.com/Vt3adkDmTu — ТРУХА⚡️English (@TpyxaNews) October 26, 2022 🚨🇷🇺☢️#Nuclear drill live update: "Under the leadership of Putin, training is being conducted to deliver a massive nuclear strike in response to an enemy nuclear strike" - Shoigu pic.twitter.com/p69BbSG0qE — Terror Alarm (@Terror_Alarm) October 26, 2022 -
ఒకదానిపై ఒకటి రైలు బోగీలు.. జనం పరుగులు.. అసలేం జరిగింది?
గుత్తి(అనంతపురం జిల్లా): రైలు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి.. జనం ఉరుకులు పరుగులు తీశారు. ఎన్డీఆర్ఎఫ్ ( నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) క్షణాల్లో ప్రత్యక్షమైంది. ప్రయాణికులను కాపాడటంతో పాటు క్షతగాత్రులకు ఎలాంటి హాని జరగకుండా బోగీల్లోంచి వెలుపలికి తీసుకువచ్చారు. అసలేం జరిగింది..ఏం జరుగుతుందో తెలియక జనం దిక్కులు చూశారు. చదవండి: అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి! అయితే అదంతా రైల్వేశాఖ నిర్వహించిన మెగా మాక్ డ్రిల్ అని తెలిసి కుదుటపడ్డారు. బుధవారం గుత్తి రైల్వే స్టేషన్‌లోని సౌత్ క్యాబిన్ సమీపంలో గుంతకల్లు డీఆర్ఎం వెంకట రమణారెడ్డి పర్యవేక్షణలో రైల్వే ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఎం కిరణ్, ఏడీఆర్ఎం మురళి కృష్ణ, సీనియర్ డీఎంఈ పుష్పరాజ్, ఏడీఎస్ఓ బాలాజి, ఏసీఎం శ్రీనివాస్, ఏడీఎం విజయ కృష్ణ, ఏడీఎంఈ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మంటల్లో రైలు.. బోగీల్లో ప్రయాణికులు! మరి ఎలా కాపాడుతారో మీకు తెలుసా? (ఫోటోలు)
-
యూపీలో దారుణం: ఆక్సిజన్ నిలిపివేసి మాక్ డ్రిల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఒకవైపు కరోనాతో తీవ్ర అనారోగ్యం , ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు విల విల్లాడిపోతోంటే..ఆగ్రాలోని పరాస్ ఆసుపత్రిలో కావాలనే "మాక్ డ్రిల్" నిర్వహించిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏప్రిల్ 27న క్రిటికల్ కేర్‌లో ఉన్న పేషెంట్లకు అయిదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం సంచలన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో రౌండ్లు కొడుతోంది. దీనిపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పారాస్ హాస్పిటల్ యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ "మాక్ డ్రిల్" లో భాగంగా ఐదు నిమిషాలు ఆక్సిజన్ సరఫరాను తగ్గించినట్లు చెబుతున్న ఒక ఆడియో చక్కర్లు కొడుతోంది. ఇదే ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు అనుమతి కూడా ఉంది. అయితే తీవ్రమైన ఆక్సిజన్ కొరత కారణంగా డిశ్చార్జ్ కావాలని ఎన్నిసార్లు చెప్పినా బాధితుల బంధువులు నిరాకరించడంతో ఒక ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దీంతో ఏప్రిల్ 27, ఉదయం 7 గంటలకు, తాము ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాను తొలగించామని, దీంతో ఊపిరాడక 22 మంది రోగుల శరీరాలు నీలం రంగులోకి మారిపోయాయనీ, వారు బతికి ఉండే అవకాశం లేదని ఈ ఆడియోలో జైన్ పేర్కొన్నారు. అందుకే ఆక్సిజన్ లేకపోతే మనుగడ కష్టమని గ్రహించి మిగిలిన 74 మంది రోగుల కుటుంబ సభ్యులను వారి వారి సొంత ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకోమని తెలిపామన్నారు. ఈ ఆడియో సంచలనంగా మారడంతో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ ఆసుపత్రిలో, ఏప్రిల్ 26, 27 తేదీలలో ఏడు కోవిడ్ మరణాలు సంభవించాయనీ, ఈ వీడియోపై దర్యాప్తు చేయనున్నామని ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ మీడియాకు తెలిపారు. మరోవైపు ఈ వీడియోపై జైన్ మాట్లాడుతూ ఆడియోలోని తన మాటలను వక్రీకరించారని చెబుతున్నారు. అసుపత్రిలో రోగుల ఆక్సిజన్ డిపెండెన్సీని, ఈ కొరతను అధిగమించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించాం తప్ప, 22 మంది చనిపోయారని తాను చెప్పలేదని వాదించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. బీజేపీ పాలనలో, ఆక్సిజన్, మానవత్వం రెండింటికీ తీవ్రమైన కొరత ఏర్పడిందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ కొరత సమయంలో ప్రధాని, యూపీ సీఎం యోగి, రాష్ట్రమంత్రి వ్యాఖ్యలను ఉటంకించిన ప్రియాంక గాంధీ, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. PM: “मैंने ऑक्सीजन की कमी नहीं होने दी” CM: "ऑक्सीजन की कोई कमी नहीं। कमी की अफवाह फैलाने वालों की संपत्ति जब्त होगी।" मंत्री: “मरीजों को जरूरत भर ऑक्सीजन दें। ज्यादा ऑक्सीजन न दें।” आगरा अस्पताल: "ऑक्सीजन खत्म थी। 22 मरीजों की ऑक्सीजन बंद करके मॉकड्रिल की।" ज़िम्मेदार कौन? pic.twitter.com/DbiqtILE27 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 8, 2021 -
కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా ముగిసిన ‘డ్రై రన్’
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలోని అయిదు సెంటర్లలో కరోనావైరస్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. జిల్లాలోని అయిదు సెంటర్లలో వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించారు. డ్రై రన్ ఏ విధంగా కొనసాగిందో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆద్వర్యంలోని కమిటీ పరిశీలించింది. ప్రతీ సెంటర్ లో 25 మంది చొప్పున వ్యాక్సినేషన్ వేశారు. ప్రధానంగా వ్యాక్సిన్ సరఫరా, భద్రత, కోవిన్ యాప్ పరిశీలన, అత్యవసర పరిస్ధితులలో ఏం చేయాలనేది ఈ డ్రై రన్ ద్వారా తెలుసుకున్నారు. (చదవండి: నేడు 4 రాష్ట్రాల్లో డ్రై రన్) విజయవాడ జీజీహెచ్, ఉప్పులూరు పీహెచ్సీ, ప్రకాష్ నగర్ ఆస్పత్రి, పూర్ణ హార్ట్ ఆస్పత్రి, కృష్ణవేణి కళాశాలలో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క సెంటర్‌కు అయిదుగురు వ్యాక్సినేషన్ అధికారులను నియమించారు. టీకా డ్రై రన్‌కు ప్రతి కేంద్రంలో అయిదుగురు సిబ్బంది ఉంటారు. ఇక మూడు గదులు ఏర్పాటు చేశారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్, రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడో గదిలో పరిశీలన ఉంటుంది. ప్రతి సెంటర్లో ఎంపిక చేసిన 25మందికి డ్రై రన్ చేపట్టారు. కాగా లోపాలు గుర్తించి అధిగమించడమే డ్రై రన్ ప్రధాన లక్ష్యం. పూర్ణ హార్ట్ ఇన్సిట్యూట్ హాస్పిటల్ లో కరోనా వాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో కరోనా డ్రై రన్ సెంటర్ లో కోవిడ్ వాక్సినేషన్, వాక్సినేషన్ సెంటర్, పరిశీలన గది ఏర్పాటు చేశారు. ఫ్రెంట్ లైన్ వారియర్స్ ఆరోగ్య కార్యకర్తల లబ్దిదారుల జాబితా రూపొందించి వారి వివరాలను అధికారులు కో-విన్ (CO-WIN) యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. వాక్సినేషన్ డ్రై రన్ ప్రక్రియని వీడియో తీసి జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ లకు నివేదిక అందించనున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వాక్సినేషన్ సెంటర్‌ని పరిశీలించనున్నారు. అలానే తాడిగడప, ఉప్పులూరు పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభం అయ్యింది. మాక్ డ్రిల్‌లో భాగంగా అధికారులు 50 మందికి వాక్సినేషన్ ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ, శానిటరి, సచివాలయ సిబ్బందికి డ్రై రన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో డ్రై రన్ సెంటర్‌ని కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ వినోద్ కుమార్ పర్యవేక్షించారు. డ్రై రన్ అంటే? నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. -
నేడు 4 రాష్ట్రాల్లో డ్రై రన్
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా టీకా పంపిణీకి యంత్రాంగం సన్నద్ధమైంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కానుంది. సన్నద్ధతలో భాగంగా డమ్మీ వ్యాక్సినేషన్ (డ్రై రన్)ను సోమవారం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో 2 రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. డ్రై రన్లో పలు కీలక దశలు ఉంటాయి. ళి ప్రతి జిల్లాలో 100 మందికి అవసరమైన డమ్మీ టీకాను సమీప డిపో నుంచి వ్యాక్సినేషన్ కేంద్రానికి తెస్తారు. ► వ్యాక్సిన్ తీసుకొనే వ్యక్తికి ఎస్ఎంఎస్ పంపిస్తారు. ఇందులో టీకా ఇచ్చే అధికారి పేరు, సమయం వంటి వివరాలుంటాయి. ► టీకా తీసుకున్న తర్వాత అరగంటపాటు అక్కడే కూర్చోవాల్సి ఉంటుంది. ► సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే చికిత్స చేస్తారు. ఈ సమాచారాన్ని సెంట్రల్ సర్వర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తారు. డ్రై రన్ అంటే? నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. -
విమానాన్ని కూల్చివేసిన ఉగ్రవాదులు గాంధీ ఆస్పత్రిలో (మాక్ డ్రిల్ )
-
డీమార్ట్ వద్ద ఉత్కంఠ
ఒంగోలు: స్థానిక రిమ్స్ వద్ద ఉన్న డీమార్ట్ షోరూంలో సోమవారం మధ్యాహ్నం డేంజర్ అలారం మోగింది. దీనికి తోడు స్టోర్ గదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని, వినియోగదారులు ఇన్‌గేటు, ఎగ్జిట్ గేటు ద్వారా సురక్షితంగా బయటకు చేరుకోవాలని అక్కడి సిబ్బంది మైక్‌లో ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్టు వినియోగించొద్దంటూ సిబ్బంది సూచనలు చేశారు. కొనుగోలుదారుల్లో తీవ్ర అలజడి రేగింది. ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో వారంతా మెట్ల మార్గం వైపు పరుగులు తీశారు. అంతా ఒకేసారి మెట్ల వైపునకు రావడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. మరో వైపు బయట ఉన్న జనానికి ఏం జరుగుతుందో అర్థంగాక మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మాల్ నుంచి బయటకు చేరుకున్న జనం మాల్ మేనేజర్‌ను నిలదీశారు. ఏమిటిదంతా అని ప్రశ్నించడంతో ప్రతి మూడు నెలలకోసారి తమ షోరూంలో ఫైర్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే మాక్ డ్రిల్‌గా చెప్పుకొచ్చారు. ప్రమాదం ఏమీ లేదని, ఒక వేళ ఫైర్ ఘటన వంటివి ఏవైనా జరిగితే వాటి నుంచి వినియోగదారులను సురక్షితంగా బయటకు పంపడం ఎలా అనే అంశంపై అవగాహన కార్యక్రమమని చెప్పకొచ్చారు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాక్ డ్రిల్ అంటూ చెప్పుకుంటే సరిపోదని, ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరంటూ వినియోగదారులు నిలదీశారు. అక్కడకు చేరుకున్న ఒంగోలు ఫైర్ ఆఫీసర్ ప్రజలకు సర్ది చెప్పారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ వై.వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పెద్ద పెద్ద సంస్థల్లో ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ తప్పనిసరన్నారు. అందులో భాగంగా సోమవారం మాక్‌డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించామని, అందులో భాగంగా డీమార్ట్ షోరూం ఫైర్ ఆఫీసర్.. జిల్లా ఫైర్ ఆఫీసర్‌కు సమాచారం అందించారన్నారు. -
ప్రాణం తీసిన మాక్ డ్రిల్; నకిలీ ఎన్డీఎమ్ఏ ఉద్యోగి
సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన మాక్ డ్రిల్‌లో 19 ఏళ్ల బీబీఏ స్టూడెంట్ లోగేశ్వరి ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసింది. ఈ ఘటనకు బాధ్యుడైన అర్ముగం ప్రస్తుతం పోలీసులు రిమాండ్‌లో ఉన్నాడు. అయితే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అర్ముగం ఎన్డీఎమ్ఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటి) ఉద్యోగే కాదని తెలిసింది. కళాశాల యాజమాన్యం పూర్తి వివరాలు విచారించకుండానే అతన్ని మాక్ డ్రిల్ కోసం పిలిపించారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు అర్ముగం వివరాలను సేకరించారు. అయితే ఇవన్ని నకిలీవని తెలింది. అంతేకాక అతని ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్ కూడా నకిలేదేనని నిర్ధారించారు. అతని దగ్గర దొరికిన ఎన్డీఎమ్ఏ గుర్తింపు పత్రాలు కూడా ఫోర్జరివేనని గుర్తించారు. అంతేకాక అర్ముగం తన ఫేస్బుక్ ప్రోఫైల్‌లో తనను తాను ఎన్డీఎమ్ఏ ఉద్యోగిగా ప్రకటించుకున్నట్లు తెలిసింది. కాలేజీ యాజమాన్యం కేవలం అర్ముగం ఫేస్బుక్ ప్రొఫైల్ చూసి అతన్ని ఎన్డీఎమ్ఏ సభ్యునిగా భావించారని, అతని పూర్తి వివరాలను తెలుసుకోలేదని తెలిపారు. విచారణ కోనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. అయితే మృతురాలి తల్లితండ్రులు తమ కుమార్తె మరణానికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతను ఎన్డీఎమ్ఏ సభ్యుడు కాదు: ఎన్డీఎమ్ఏ అర్ముగం తనను తాను ఎన్‌ఎమ్‌డీఏ ఉద్యోగిగా చెప్పుకుని కాలేజీలో మాక్ డ్రిల్ నిర్వహించి ఒకరి మరణానికి కారణమవడంతో స్వయంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎమ్ఏ) రంగంలోకి దిగింది. మాక్ డ్రిల్ నిర్వహించిన సభ్యుడు ఎన్‌డీఎమ్‌ఏకు చెందిన వ్యక్తి కాదని ప్రకటన విడుదల చేసింది. వివరాల ప్రకారం.. ‘ఇటువంటి మాక్ డ్రిల్స్‌కు ఎన్డీఎమ్ఏ అనుమతివ్వదు. కాలేజీలో నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఎన్డీఎమ్ఏ భాగస్వామ్యం లేదు. సదరు ట్రైనీ అసలు ఎన్‌డీఎమ్‌ఏకు చెందిన వ్యక్తే కాద’ని ప్రకటించింది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇటువంటి డ్రిల్స్ నిర్వహించకూడదని హెచ్చరించింది. ఏది ఏమైనా పొరపాటు జరిగిందని, ఒక నిండు ప్రాణం బలైందని సంతాపం తెలిపింది. -
అయ్యో పాపం.. లోగేశ్వరి
కాలేజీలో నిర్వహించిన మాక్ డ్రిల్ విషాదాంతంగా ముగిసింది. ట్రైనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఓ 19 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే... సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. చెన్నైకి చెందిన ఫైర్ సేఫ్టీ బృందం.. సుమారు 20 మంది స్టూడెంట్లను ఎంపిక చేసి 40 రోజులుగా శిక్షణ కూడా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నాంతో విద్యార్థులను ఒక్కోక్కరికిగా రెండో అంతస్థు నుంచి కిందకు దూకించగా.. కింద విద్యార్థులు వల సాయంతో వారిని రక్షిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లోగేశ్వరి(19) అనే బీబీఏ స్టూడెంట్ను సహాయక సిబ్బంది కిందకు తోశాడు. అయితే ఆ విద్యార్థిని అప్రమత్తంగా లేకపోవటంతో.. కింద ఫ్లోర్ సెల్ఫ్‌కు తలబలంగా తాకి కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లోగేశ్వరి స్వస్థలం అలందూరి. ఘటన గురించి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి లోగేశ్వరి మరణానికి కారణమయ్యాడంటూ ట్రైనర్ అర్ముగంను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
మాక్ డ్రిల్‌లో విషాదం..!
-
తాడ్బంద్ దేవాలయంలో ముష్కరులు..
కంటోన్మెంట్ (బోయిన్పల్లి) : ‘నిత్యం వేలాది మంది భక్తులు సం దర్శించే తాడ్బంద్ దేవాలయంలోకి ఆదివారం రాత్రి ముష్కరులు చొరబడ్డారు!! సమాచారం అందుకున్న వెంటనే ఆక్టోపస్, సిటీ సెక్యూరిటీ గార్డ్స్ బృందాలతో పాటు, బోయిన్పల్లి పోలీసుల బృందం ఆలయాన్ని చుట్టుముట్టింది. వేర్వేరు బృందాలుగా విడిపోయి మెరుపు వేగంతో సమీపంలోని భవనాల మీదుగా దేవాలయం నలుదిక్కులకు చేరారు. అప్పటికే ఆలయం లోపు మాటువేసి ఉన్న ముష్కరుల కదలికలను కనిపెడుతూ ఒక్కొక్కరుగా దేవాలయంలోకి చేరిపోయారు. పోలీసులను ప్రతిఘటిస్తూ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న ముష్కరులను చాకచక్యంగా లొంగదీసుకున్నారు. దీంతో పోలీసులతో పాటు అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు’ ఇదంతా నిజమనుకుంటున్నారు కదూ. అదేం కాదు. అసలేమైందంటే.. సికింద్రాబాద్ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో బోయిన్పల్లి పోలీసులు, ఆక్టోపస్, సిటీ సెక్యూరిగార్డ్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన మాక్ డ్రిల్ ఇది. ఆక్టోపస్ డీఎస్పీ వీరరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌డ్రిల్ మొత్తం 100 మందికిపైగా పోలీసులు పాల్గొన్నారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో సందర్శించే షాపింగ్ మాల్స్, ప్రార్థనాలయాలు, ఇతరత్రా రద్దీ ప్రదేశాల వద్ద నిర్వహిస్తున్న మాక్‌డ్రిల్స్‌లో భాగంగానే తాడ్బంద్ దేవాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించామని బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. మాక్ డ్రిల్‌లో బోయిన్పల్లి ఎస్ఐలు రఘువీర్‌రెడ్డి, సాయికిరణ్ సహా 20 మందికిపైగా సిబ్బంది పాల్గొన్నారు. -
దేవాలయంలో ముష్కరులు..!
సాక్షి, రాంగోపాల్‌పేట్ : నిత్యం భక్తులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్‌లోని లక్ష్మీగణపతి దేవాలయం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కొంత మంది ముష్కరులు దేవాలయంలోకి ప్రవేశించారు.. దేవాలయంలో డిటోనేటర్లు, బాంబులు అమర్చారు.. కొందరు భక్తులు, ఆలయ సిబ్బందిని బంధించారు. దీన్నీ సీసీ కెమెరాల్లో గమనించిన ఆలయ చైర్మన్, ఈవోలు వెంటనే గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక పోలీసులతో పాటు ఆక్టోపస్ సిబ్బంది రంగంలోకి దిగారు. చేతిలో అత్యాధునిక ఆయుధాలు, మాస్క్‌లు ధరించిన ఆక్టోపస్ సిబ్బంది రెండు గ్రూపులుగా విడిపోయి దేవాలయంలోకి ప్రవేశించి చాకచక్యంతో బంధీలను విడిపించారు. బాంబులను నిర్వీర్యం చేసి ముష్కరులను అంతమొందించారు. ఇదంతా నిజం కాదు.. కానీ నిజంగా అలా జరిగితే ఎలా ఉంటుంది. తీవ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఆక్టోపస్, గోపాలపురం పోలీసులు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, మహంకాళీ ఏసీపీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అక్టోపస్ మాక్‌డ్రిల్ లో ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఆక్టోపస్ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదాలు జరిగినపుడు ఏ విధంగా రక్షించాలో అన్న అంశాలపై ఆదిభట్ల సమీపంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ క్రమంలో రెండు అక్టోపస్ బస్సులు ఢీకొన్నాయి. దీంతో బస్సులోని ఐదుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సురేష్, శేఖర్, రఘుపతి, రావు భవాని సింగ్, చెన్నకేశవ రెడ్డిగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై మీడియాకు వివరాలు తెలియకుండా ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. -
సికింద్రాబాద్‌లో డాగ్ స్క్వాడ్‌తో మాక్‌డ్రిల్
-
విశాఖ సముద్ర తీర గ్రామాల్లో మాక్‌డ్రిల్
-
హుస్సేన్ సాగర్ లో ఆర్మీ అద్భుత విన్యాసాలు
-
ఆకట్టుకున్న‘ప్రళయ్ సహాయ్’
-
ఆకట్టుకున్న‘ప్రళయ్ సహాయ్’
సాక్షి, హైదరాబాద్: భారతీయ రక్షణ దళం దక్షిణ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రళయ్ సహాయ్ కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. శనివారం ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి హుస్సేన్‌సాగర్ వేదికైంది. ఆకస్మిక వరదలు విపత్తుల సందర్భంగా చేపట్టే అత్యవసర సహాయక సేవలు, పునరావాస కార్యక్రమాలపై ప్రదర్శనలను (మాక్‌డ్రిల్) ఏర్పాటు చేశారు. భారతీయ రక్షణ, విమాన, నావికా దళాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నివారణ విభాగాలు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. నగరంలో భారీ వరద సంభవిస్తే మునిగిన ఇళ్లు, భవనాల నుంచి ప్రజలను ఏవిధంగా రక్షించాలనే దానిపై సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. దీని కోసం హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయిన ఇళ్లు, భవనాలు, విద్యాసంస్థలు, వాహనాల నమూనాలను ఏర్పాటు చేశారు. ఈ భవనాల్లో ప్రజలు చిక్కుకున్నట్లు కేకలు వేస్తూ కనిపించారు. వారిని సైనికులు స్పీడు బోట్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించారు. వీటితో పాటు హెలికాప్టర్ నుంచి సైన్యం సాగర్‌లోకి తాడు సాయంతో దిగడం, వారు పడవల ద్వారా నీట మునిగిన భవంతుల వద్దకు చేరుకుని వాటిల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం వంటివి ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ విన్యాసాలను లెఫ్టినెంట్ జనరల్ పీఎం హరీద్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వీక్షించారు. -
హుస్సేన్‌సాగర్‌లో మాక్‌డ్రిల్
-
సునామీ అంటే భయం ఏల?
పాకల: సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కందుకూరు ఆర్డీఓ మల్లికార్జునరావు అన్నారు. పాకల పల్లెపాలెంలో బుధవారం సునామీ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి బి.వి.ఎస్. రాం ప్రకాష్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సహకారం మరువలేనిదన్నారు. సముద్రంలో మునిగిన వ్యక్తిని ఏవిధంగా బయటకు తీసుకుని వచ్చి కాపాడాలో అగ్నిమాపక సిబ్బంది మాక్‌డ్రిల్ చేశారు. మత్స్యశాఖ ఏడీఈ షేక్ లాల్మహమ్మద్, కొండపి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఉదయ్‌భాస్కర్ , జిల్లా సమగ్ర వ్యాధి నివారణ అధికారి డాక్టర్ పి. పుల్లారెడ్డి, సీఐ భీమానాయక్, ఎస్సె›్త వైవి రమణయ్య, మండల స్పెషల్ఆఫీసర్ జెన్నమ్మ, తహసీల్దార్ షేక్ దావూద్‌హుస్సేన్, ఎంపిడిఓ షేక్ జమీఉల్లా, మండల ఇరిగేషన్ ఏఇ విజయలక్ష్మి, పంచాయితిరాజ్ ఏఇ శ్రీహరి, రెడ్‌క్రాస్ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ కోటయ్య, పంచాయితి కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు. – పాకల తీరంలోమాక్ డ్రిల్ -
సమన్వయంతో విపత్తులకు అడ్డుకట్ట: కలెక్టర్
బందరువానిపేట: సమన్వయంతో సమష్టిగా పనిచేసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, సునామీ వంటి విపత్తులను ఎదుర్కొవచ్చని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. సముద్రతీర ప్రాంతమైన బందరువానిపేటలో బుధవారం ప్రకృతి విపత్తులకు సంబంధించి మాక్‌డ్రిల్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పశు సంపద, ఇతర జంతు సంపదను ఎలా రక్షించాలో...ఇందుకు అధికారులు ఏం చర్యలు తీసుకోవాలో సూచించారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకునే చర్యలకు సంబంధించి కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ఏకకాలంలో పనులన్నీ ఏ విధంగా చేయాలో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, డీఎస్పీ భార్గవరావునాయుడు, ఆర్డీవో దయానిధితో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
‘ఇన్కాయిస్’లో సునామీ మాక్‌డ్రిల్
గాజులరామారం: డివిజన్ పరిధిలోని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా సంస్థ(ఇన్ కాయిస్)లో బుధవారం ఐఓ వేవ్-16 పేరిట సునామీ మాక్ డ్రిల్ నిర్వహించారు. రెండు రోజుల పాటు మాక్ డ్రిల్ కొనసాగనుంది. డ్రిల్ లో భాగంగా శాస్త్రవేత్తలు సముద్ర భూగర్భంలో పలుమార్లు కృత్రిమ భూకంపాలు సృష్టించారు. మొదటిరోజు 9.2 తీవ్రతతో ఇండోనేసియా, సుమత్రా దీవుల్లో భూకంపం సంభవిస్తే కలిగే దుష్ర్పభావాలపై డ్రిల్ ను నిర్వహించారు. అటువంటి సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. -
అదుపు తప్పిన విమానం!
♦ రన్‌వేపై ఘటన ♦ ప్రయాణికులకు తీవ్ర గాయాలు ♦ పరుగులు పెట్టిన భద్రతాదళాలు ♦ అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో మాక్‌డ్రిల్ శంషాబాద్: అది రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. అర్ధరాత్రి 12 గంటలు.. మరికాసేపట్లో సురక్షితంగా ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానంలో హైడ్రాలిక్ పవర్ సమస్య తలెత్తింది. ఆ వెంటనే రన్‌వేపై అదుపు తప్పింది. ఆ కుదుపునకు ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. విమానంలోని స్మోకింగ్ అలారం మోగగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు క్రాషింగ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. వైద్యుల బృందం, విమానాశ్రయ భద్రతా బలగాలు విమానం సమీపంలోకి క్షణాల్లో చేరుకున్నాయి. హుటాహుటిన ప్రయాణికులను, సిబ్బందిని బయటకు తరలించి ఆ సమీపంలోనే వైద్య సేవలు ప్రారంభించారు. అచ్చంగా నిజమనిపించే ఈ మాక్‌డ్రిల్ గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో నిర్వహించారు. విమా నం కుప్పకూలితే తక్షణ చర్యలు తీసుకోవడంలో భాగంగా చేపట్టిన ఈ మాక్‌డ్రిల్ విమానాశ్రయ సిబ్బందితోపాటు ప్రయాణికులనూ అప్రమత్తం చేసింది. దేశంలోనే ప్రథమంగా అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలో మాక్‌డ్రిల్ నిర్వహించామని అధికారులు వెల్లడించారు. ఇందులో సీఐఎస్ఎఫ్, జీఎంఆర్ సెక్యూరిటీ, జిల్లా కలెక్టరేట్ యంత్రాంగం, సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ విపత్తుల శాఖ సిబ్బంది, జిల్లా వైద్యాధికారులు, 500 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఇం దుకు వినియోగించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రెండున్నర గంటలపాటు మాక్‌డ్రిల్ నిర్వహించారు. -
న్యూఢిల్లీలో నిఘా సంస్థల మాక్ డ్రిల్
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని పలు రద్దీ ప్రాంతాలపై కేంద్ర నిఘా సంస్థ దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అయితే, ఉగ్రవాదుల దాడులు జరిగితే ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగా బలగాలు ఈ చర్యలు చేపట్టాయి. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన మాక్ డ్రిల్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) కమాండోలు పాల్గొన్నాయి. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మాక్‌డ్రిల్
-
మాక్ డ్రిల్‌లో ‘ఉగ్రవాదులకు’ ముస్లిం టోపీలు!
గుజరాత్ పోలీసుల నిర్వాకం సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు బుధవారం నిర్వహించిన ఉగ్రవాద నిరోధక మాక్ డ్రిల్ వివాదాస్పదమైంది. డ్రిల్‌లో భాగంగా ముగ్గురు యువకులను ఉగ్రవాదులుగా నటించమని కోరిన పోలీసులు ఇందుకోసం వారికి ముస్లిం టోపీలు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగింది. దీనిపై తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ...ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. పోలీసుల చర్యను గుజరాత్ బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మెహబూబ్ అలీ సూఫీ బాబా కూడా తప్పుబట్టారు. అయితే పోలీసులు మాత్రం తమ చర్యను సమర్థించుకున్నారు. మాక్ డ్రిల్స్‌ను రకరకాల వేషధారణల్లో నిర్వహిస్తుంటామని...ఇందులో తప్పేమీ లేదన్నారు. -
కళ్లకు కట్టినట్టుగా చూపించారు!!
-
పోలీసులు రెడీ
పీఎల్జీఏను అడ్డుకోవడానికి సన్నాహాలు 250మంది ఎన్ఎస్జీ, అక్టోపస్ బలగాలు రాక మాక్ డ్రిల్ పేరుతో మకాం ఛత్తీస్‌గఢ్ ఘటనతో అప్రమత్తం ‘మావోయిస్టులతో మరో యుద్ధం మొదలైంది’..కొద్ది రోజుల క్రితం జిల్లా పోలీసులు చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేక బలగాలు విశాఖలో అడుగుపెట్టాయి. మాక్ డ్రిల్ పేరుతో నాలుగు రోజులుగా మకాం వేశాయి. మంగళవారం నుంచి ఏజెన్సీలో పీఎల్‌జీఏవారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం భారీ సన్నాహాలు చేస్తోంది. విశాఖ నగరంలో ఉన్న 250 మంది ఎన్ఎస్జీ, ఆక్టోపస్ బలగాలను వినియోగించుకోవాలని చూస్తోంది. నిజానికి మావోలపై యుద్ధానికే ఇంత మందిని రంగంలోకి దింపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం నాటి ఘటనతో మరింత అప్రమత్తమయ్యారు. వారోత్సవాలను అడ్డుకుంటామని ఓఎస్డీ విశాల్‌గున్ని ప్రకటించారు. విశాఖపట్నం: వీరవరంలో కొద్ది రోజుల క్రితం మావోయిస్టులను గిరిజనులు హతమార్చడంతో మొదలైన అలజడి క్షణ క్షణం భయాన్ని సృష్టిస్తూనే ఉంది. ఆ సంఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని, కారకులను ప్రజాకోర్టులో శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరికలు చేయడంలో గిరిజనులు కలవరపడుతున్నారు. ఇదే అదునుగా పోలీసులు పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. గిరిజనులు, మావోయిస్టుల మధ్య ఏర్పడిన అంతరాన్ని పెద్దది చేసి శాశ్వతంగా వారి బంధాన్ని తెంచాలని ప్రమత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన దళసభ్యులు పోలీసులపై ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులే కొందరు గూండాలతో తమ వారిని హత్య చేయించారని,గిరిజనులతో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేస్తున్నారని, అయినా తాము భయపడేది లేదని లేఖల ద్వారా స్పష్టం చేశారు. జిల్లాలో ఓ వైపు పోలీసులు, గిరిజనులు, మావోయిస్టుల మధ్య పరస్పర యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు విశాఖ నగరానికి ఈ నెల 27న ఎన్ఎస్జీ, ఆక్టోపస్ పోలీసులు 250మంది చేరుకున్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు గోప్యంగా ఉంచాయి. అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు దాడులకు తెగబడితే ఏ విధంగా ఎదుర్కొవాలనేదానిపై విశాఖలో మాక్‌డ్రిల్ నిర్వహించడానికి వచ్చారని అధికారులు చెబుతున్నారు. దీనిపై సోమవారం ఓ హోటల్లో ఎన్ఎస్జి మేజర్ సూరజ్, ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ చిట్టిబాబులు జిల్లా పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో మాక్‌డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించారు. 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుండటంతో అత్యవసరమైతే అందుబాటులో ఉండేలా ఇంతమంది సిబ్బందిని జిల్లాకు రప్పించారని సమాచారం. ప్రత్యేక వాహనాలు, ట్రక్కులు కూడా వీరికి అందుబాటులో ఉంచారు. మావోయిస్టుల వారోత్సవాలు, పోలీసుల మాక్‌డ్రిల్‌తో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం మావోయిస్టులు దాడి చేసి పోలీసులను మట్టుబెట్టడంతో మరింత అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున బలగాలను మన్యానికి తరలిస్తున్నట్టు ఓఎస్డీ విశాల్‌గున్ని ‘సాక్షి’కి తెలిపారు. -
ఏకే47లతో లోపలికి వచ్చిన ఉగ్రవాదులు..
* ఏమైందక్కడ? * బీబీఎంపీ వద్ద బాంబు పేలుళ్లు * ముసుగు ధరించి ఏకే47లతో లోపలికి వచ్చిన ఉగ్రవాదులు * ఉద్యోగులు, జనం అరుపులు.. కేకలు * క్షణాల్లో పోలీసుల మోహరింపు * అందరినీ అదుపులోకి తీసుకున్న వైనం * ఇదంతా మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరిపీల్చుకున్న జనం బెంగళూరు : అది బీబీఎంపీ కార్యాలయం... సమయం ఉదయం పది గంటలు. ఉద్యోగులందరూ విధుల్లో నిమగ్నమయ్యారు. అధికారులతో పనులున్న వాళ్లు వస్తున్నారు.. పోతున్నారు. ఆవరణమంతా ప్రశాంతంగా ఉంది. ఉన్నట్లుండి బీబీఎంపీ కార్యాలయం గేటు వద్ద బాంబ్ పేలింది. ఆ పేలుడుకు భూమి దద్దరిల్లింది. అధికారులు, ప్రజల గుండెలదిరాయి. ఈ అనుకోని సంఘటనతో ఒక్కసారిగా అక్కడి వారు షాక్‌కు గురయ్యారు. ఏమి జరిగింది.. ఏమైంది... అంటూ అటు ఇటు పరుగులు పెట్టారు. అంతలోనే పాలికె కౌన్సిల్ సమావేశం జరిగే భవనం ముందు మరో రెండు బాంబులు పేలాయి. నిమిషం క్రితం ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం.. ఒక్కసారిగా యుద్ధభూమిని తలపించేలా మారింది. ఏమవుతోందో అర్థం కాక అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. అంతలోనే కొందరు ఉగ్రవాదులు ముసుగులు ధరించి చేతిలో ఏకే- 47, స్టన్గన్లతో కార్యాలయంలోకి చొరబడ్డారు. అంతే అక్కడున్న వారి ప్రాణాలు పైకి పోయాయి. అక్కడున్న ఉద్యోగులు, ప్రజలను ఆ ఉగ్రవాదులు చుట్టుముట్టారు. వారిని ఒక చోటకు వెళ్లాలని బెదిరించారు. వారి అరుపులకు అక్కడి వారు జడుసుకున్నారు. వారు చెప్పినట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉగ్రవాదుల నిరోధక దళం వారు పాలికె సర్వసభ్య సమావేశ భవనాన్ని చుట్టుముట్టారు. చాకచక్యంగా లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వారిని క్షేమంగా రక్షించారు. అంతా అయిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. ఇదంతా మాక్‌డ్రిల్‌లో భాగమని.. ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడానికే ఇలా చేశామని అధికారులు చెప్పారు. దీంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్
-
తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్
సాక్షి, తిరుమల: యాక్షన్ టీంగా పరిగణించే ఆక్టోపస్ కమాండోలు గురువారం తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. తీవ్రవాది ప్రయాణించే వాహనాన్ని మరో వాహనంతో ఛేజ్ చేయడం.. చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకునే విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. గురువారం ఉద యం తిరుమలలో బాలాజీనగర్ రింగ్‌రోడ్డులో నిర్వహించిన మాక్ డ్రిల్ సాగిందిలా.. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా ఓ కారు రింగ్‌రోడ్డుపైకి దూసుకుపోయింది. వెనుకే మరో కారు మెరుపు వేగంతో దూసుకొచ్చింది. వాహనం నుంచే కమాం డో సిబ్బంది తుపాకులు చేతపట్టి ముందు వెళ్లే వాహనంపై గురిపెట్టారు. చాకచక్యంగా ముందుకారును అడ్డగించారు. సెకన్ల వ్యవధిలోనే కమాం డోలు తుపాకులు, పిస్తోళ్లు చేతపట్టుకుని వాహనం దిగారు. అంతకుముందే ఆ రహదారి, ముళ్లపొదలు, చెట్ల మధ్యలో బృందాలుగా కాపుకాచిన ఆక్టోపస్ కమాండోలు హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి ఆయుధాలతో అడ్డగించారు. వాహనం వద్దకు వెళ్లి తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి ఆలయ భద్రత కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన ఆక్టోపస్ యూనిట్ కమాండో దళాలకు ప్రతినెలా ఏదో ఒక అంశంపై మాక్ డ్రిల్ చేస్తూ ఉగ్రవాదులు, నేరస్తులు, నిందితులను పట్టుకునే విషయంలో ఇలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.