breaking news
District TopStories
-
వింటర్లో ముఖం తేటగా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి!
'చలికాలంలో ముఖం పొడిబారిపోవడమూ, పెదవులు పగలడం, ముఖంపై ముడతలు రావడం చాలా సాధారణం. అందరికీ తెలిసిన చిట్కా వ్యాజలైన్ రాయడంతో పాటు ఈ కాలంలోనూ ముఖం తేటగా, ఆరోగ్యంగా ఉంచేందుకు పాటించాల్సిన చిట్కాలివి..' చలికాలంలో ఉదయం, సాయంత్రం మంచుకురుస్తున్నా.. మధ్యాహ్నపు ఎండ తీక్షణంగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ మంచుకూ, మధ్యాహ్నపు ఎండకూ నేరుగా ముఖచర్మం ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈకాలంలో ఉండే మంచు, పొగ కలిసిన కాలుష్యం.. స్మాగ్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తేటగా మారుతుంది. రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రతో ముఖం తేటబారుతుంది. ఆహార పరంగా.. అన్ని రకాల పోషకాలు అందే సమతులాహారాన్ని రోజూ తీసుకోవాలి. అయితే చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఇది సరికాదు. రోజూ తప్పనిసరిగా మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఆకుకూరలు, కూరగాయలూ, ములగకాడల వంటి తాజా కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్లో దొరికే పండ్లను తప్పక తీసుకోవాలి. ఇందులోని నీటిమోతాదులూ, పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి ముఖాన్ని తేటగా కనిపించేలా చేస్తాయి. డ్రైఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చదవండి: గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే! -
ఎన్నికల స్టంటే అనుకో!: మంత్రి మల్లారెడ్డి టంగ్‌స్లిప్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలి కామెంట్లతో వార్తల్లోకెక్కారు. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటేనంటూ వ్యాఖ్యానించారాయన. టీఎస్సార్సీటీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంపై ఉద్యోగుల నుంచి హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం పీర్జాదిగూడ పార్టీ కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా.. TSRTC కార్మికులకు డబుల్కా మీటాలాగా.. ఊహించని విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ చేశారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటా?అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు.. ‘‘ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకోండి.. మాది రాజకీయ పార్టీ.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎట్లైనా ఎన్నికల స్టంట్ ఉంటది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ వెంటనే సవరించుకుని.. ‘‘ఎన్నికల కోసమే అయినా కార్మికులకు మంచి జరిగింది. ఆర్టీసీ విలీనం చేయాలంటే దమ్ము, ఫండ్స్ ఉండాలి. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కార్మికులు సంతోషంగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారాయన. ఇదీ చదవండి: మెట్రో విస్తరణ వాళ్ల లబ్ధి కోసమే! -
‘నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదు’
సాక్షి, సూర్యాపేట జిల్లా: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని, కొంతమంది కావాలనే తనపై ఈ రకమైన ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పనికట్టుకుని బీఆర్ఎస్తో పాటు కొంతమంది సొంత పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు. నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలాంటి వ్యక్తి పై దుష్ప్రచారం జరగడం దురదృష్టకరం. దయచేసి ప్రజలు , కార్యకర్తలు ఎవరు దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు నన్ను సంప్రదించలేదు. నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదు. నా పుట్టుక కాంగ్రెస్ చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సూర్యాపేట నుండే పోటీ చేయబోతున్నా. టికెట్ నాదే.. గెలుపు నాదే ఇందులో ఎలాంటి అనుమానంలేదు. లోకల్ నాన్ లోకల్ అని ప్రచారం కరెక్ట్ కాదు. ఎవరు పార్టీలో లేనప్పుడు నేనొక్కడినే ఇక్కడ నుండి గెలిచా. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశా. ఇండిపెండెంట్ గా గెలిచినా ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ మారకుండా తిరిగి కాంగ్రెస్ లోకే వచ్చా. నాకు గ్రూపులు లేవు నాది కాంగ్రెస్ గ్రూపు సోనియా గ్రూపు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తా’ అని దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నారా?.. ట్రాఫిక్ రూల్స్ మారాయ్.. కొత్త స్పీడ్ లిమిట్స్ ఇవిగో -
కిషన్‌రెడ్డిపై జిట్టా సంచలన వ్యాఖ్యలు.. ‘కేసీఆర్ ఆదేశాలతోనే సస్పెండ్ చేశారు’
నాంపల్లి (హైదరాబాద్): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా, శనివారం ఆయన గన్‌పార్కు ఎదుట విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల తర్వాత పార్టీ గప్‌చుప్ కావడానికి కారణమేమిటి? పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారు? ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఏమైందని ప్రశ్నిస్తే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. పార్టీని బలహీనపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, విజయశాంతి తదితర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తానెక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను ఇతర పార్టీల నేతలతో కిషన్‌రెడ్డి మాదిరిగా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్‌రెడ్డి తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే కవిత కేసును నిర్వీర్యం చేశారని, ఈ ఒప్పందంలో భాగంగానే కిషన్‌రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిందని జిట్టా వ్యాఖ్యానించారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయటం లేదని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ: కవిత కీలక వ్యాఖ్యలు -
బేగంపేట్.. c/o వీఐపీ ఎయిర్పోర్ట్
ఈ ఎయిర్‌పోర్టులో విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు వీలుగా, భద్రతా అవసరాల నిమిత్తం ప్రాంగణానికి సమీపంలో అంటే.. 5నుంచి 6కి.మీ దూరంలోఉన్న 18 మీటర్లకంటే ఎత్తయిన భవనాలపై ‘ఎయిర్ క్రాఫ్ట్ అబ్ స్ట్రక్షన్ వార్నింగ్ లైట్స్’ ఏర్పాటు చేసుకోవాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ఈ లైట్ల ఏర్పాటుతో పైలెట్లు బేగంపేట్ విమానాశ్రయంలో ఫ్లైట్స్‌ను ల్యాండ్ చేసే సమయంలో వారికి అక్కడ అత్యంత ఎత్తయిన భవంతి ఉన్న విషయాన్ని పసిగట్టే అవకాశం ఉంటుందని, ఈ ఆదేశాలన్నీ భద్రతా కోణంలో జారీ చేసినవని విమానాశ్రయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ సిటీ నడిబొడ్డున ఉన్న బేగంపేట్ విమానాశ్రయానికి మరింత క్రేజ్ పెరుగుతోంది. వీఐపీలు, వీవీఐపీలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ వంటి ప్రముఖులు వినియోగించే చార్టర్ ఫ్లైట్స్ రాకపోకలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ప్రతినెలా ఈ విమానాశ్రయం నుంచి వందలాదిగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విమానాశ్రయం నగరంలోని ప్రధాన ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉండడంతో వీఐపీలు, వీవీఐపీలు ఇక్కడి నుంచి ఇతర దూరప్రాంతాలకు బయలుదేరి వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. అయితే, ఈ విమానాశ్రయానికి సమీపం (5–6 కి.మీ)లో సుమారు 18 మీటర్ల కంటే ఎత్తున్న బహుళ అంతస్తుల భవనాల యజమానులు ‘ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా’(ఏఏఐ) నుంచి ఆన్లైన్లో ఎన్ఓసీలు(నిరభ్యంతర పత్రాలు) పొందాలని తాజాగా ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ ఆదేశాలిచ్చింది. రోజురోజుకు పెరుగుతోన్న రద్దీబేగంపేట్ విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతితో పాటు పలు వురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలు రాకపోకలు సాగించేందుకు ఇది అనుకూలంగా ఉండడంతో వారంతా ఈ ఎయిర్‌పోర్టుపై ఆసక్తిచూపుతున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో విమానాల రద్దీ పెరుగుతోంది. ఇక నగరానికి వచ్చే దేశ, విదేశీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం ఈ విమానాశ్రయంలోనే తమ చార్టర్ ఫ్లైట్స్‌ను ల్యాండ్ చేసేందుకు ఇష్టపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో నెలకు సుమా రు 300కు పైనే ప్రైవేట్ విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రైవేటు ఫ్లయింగ్ క్లబ్స్, డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను వినియోగించే రక్షణశాఖ సైతం ఈ విమానాశ్రయం సేవలను తరచూ వాడుకుంటుండడంతో రద్దీ పెరుగుతోంది.ఎన్ఓసీలకు దరఖాస్తు ఇలా.. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఎత్తయిన భవంతుల యజమానులు భవనం ఎత్తు క్లియరెన్స్‌కు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) పొందాల్సి ఉంటుంది. ఈ ఎన్ఓసీని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పదిరోజుల్లో ఆన్లైన్లోనే జారీ చేస్తారు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్ల వరకు ఉంటుంది. ఈఎన్ఓసీలను ఉచితంగానే జారీచేస్తామని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఆయా భవనాల యజమానులు తమ భవవతుల పూర్తి వివరాలు, జీహెచ్ఎంసీ జారీ చేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తదితర వివరాలను ఆన్లైన్లోనే పూరించాల్సి ఉంటుంది. ఇందుకోసం హెచ్‌టీటీపీఎస్://ఎన్‌ఓసీఏఎస్2.ఏఏఐ.ఏఈఆర్ఓ/ఎన్‌ఓసీఏఎస్ వెబ్సైట్లో సంప్రదించాలి. -
క్రిమినల్స్ అడ్డా..C/o రైల్వేస్టేషన్
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లు నేరగాళ్లకు అడ్డాలుగా మారుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, కాజీపేట్, వరంగల్, మంచిర్యాల, నాంపల్లి, బేగంపేట్, లింగంపల్లి తదితర ప్రధాన రైల్వేస్టేషన్లలో నిత్యం నేరాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ కారణాలతో ఒంటరిగా రైల్వేస్టేషన్లకు వచ్చే చిన్నారులను టార్గెట్‌గా చేసుకుని కొన్ని ముఠాలు అపహరిస్తున్నాయి. ఇవే కాకుండా దొంగతనాలు, మోసాలు, గుర్తుతెలియని వ్యక్తుల మృతి తదితర నేరాలు కూడా పెద్దసంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. ఏటా 2600కు పైగా నేరాలు జరుగుతుండటం గమనార్హం. ఇందులో వెయ్యికి పైగా దొంగతనాలు ఉంటున్నాయి. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోనే ఏటా 750 నుంచి 800 వరకు వివిధ రకాల కేసులు నమోదవుతున్నట్లు అంచనా. నిఘా ఉన్నా లేనట్లే....ప్రతి రోజూ సుమారు 1.8 లక్షల మంది ప్రయాణికులు, 200కు పైగా రైళ్ల రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 96 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 40 మాత్రమే పని చేస్తుండగా మిగతావి అలంకారప్రాయంగా మారాయి. మరోవైపు ఒకటో నంబర్, పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద మెటల్ డిటెక్టర్లు, లగేజీ స్కానర్లు ఏర్పాటు చేశారు. అయితే భద్రతా సిబ్బంది పెద్దగా తనిఖీలు చేయకపోగా, ప్రయాణికులు సైతం మెటల్ డిటెక్టర్ల నుంచి రాకపోకలు సాగించడం లేదు. దీంతో అవి కూడా దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వెయిటింగ్ హాల్ వద్ద ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసిన చిన్నారి ఆయుష్ ఉదంతంలో వెయిటింగ్ హాల్‌కు సమీపంలో ఉన్న సీపీ కెమెరాలో వివరాలు లభించాయని, అదే ఘటన ఐదో నంబర్, ఏడో నంబర్ ప్లాట్‌ఫామ్‌లపై జరిగి ఉంటే నేరస్తులను గుర్తించడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు.ప్రయాణికుల భద్రతా ప్రమాణాల మేరకు 400 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్‌ఫామ్‌పైన ప్రతి వ్యక్తి కదలికలను నమోదు చేసేందుకు కనీసం 10 నుంచి 15 సీసీకెమెరాలు ఉండాల్సి ఉండగా, ఒక్కో ప్లాట్‌ఫామ్‌కు రెండు కెమెరాలు మాత్రమే ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత భద్రతావ్యవస్థలో భాగంగా స్టేషన్‌కు వచ్చిన ప్రతి వ్యక్తి, ప్రతి వాహనం, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ విధానం మొక్కుబడిగా కొనసాగుతుండగా, కాచిగూడ, నాంపల్లి తదితర స్టేషన్లలో పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో 120 సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే పోలీసులు గత కొన్నేళ్లుగా కోరుతున్నా ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీనికితోడు నేరగాళ్లు తేలిగ్గా పారిపోయేందుకు స్టేషన్లకు అన్ని వైపులా రాచమార్గాలు ఉండనే ఉన్నాయి. ఏమార్చి ఎత్తుకెళ్తున్నారు.....‘‘ రైల్వే స్టేషన్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. అవి ఎంత దూరం వరకు రికార్డు చేస్తున్నాయనే అంశాలపైన దొంగలు, నేరగాళ్లకు స్పష్టమైన అవగాహన ఉంది. ఒక్క సికింద్రాబాద్ స్టేషన్లోనే ఏటా 750కి పైగా కేసులు నమోదవుతుండటం ఇందుకు నిదర్శనం.’’ అని ఒక పోలీసు అధికారి పేర్కొనడం గమనార్హం. కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో 300 కేసులు నమోదవుతుండగా, బేగంపేట్, లింగంపల్లి, హైటెక్‌సిటీ, నాంపల్లి, తదితర స్టేషన్ల పరిధిలో మరో 300 కేసులు నమోదవుతున్నాయి. నేరాల నమోదులో హైదరాబాద్ తరువాతి స్థానాన్ని మంచిర్యాల రైల్వేస్టేషన్ ఆక్రమిస్తోంది. అక్కడ 330 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానాల్లో కాజీపేట్, వరంగల్ స్టేషన్లు ఉన్నాయి. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు, రైళ్లలో సీట్ల కోసం, బెర్తుల కోసం వెతుక్కునేవారిని టార్గెట్‌గా చేసుకుంటున్న దొంగలు వారిని ఏ మార్చి బ్యాగులు, వస్తువులతో ఉడాయిస్తున్నారు. సిబ్బంది కొరత....జీఆర్పీలో సిబ్బంది కొరత కూడా నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఏటా వేల సంఖ్యలో నేరాలు చోటు చేసుకుంటుండగా పోలీసులు మాత్రం వందల్లోనే ఉన్నారు. సికింద్రాబాద్ జీఆర్పీలో కనీసం 1000 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 400 మందితో నెట్టుకొస్తున్నారు. దీంతో స్టేషన్లలో భద్రత, అసాంఘిక శక్తులపైన నిఘా ఉంచడం కష్ట తరమవుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ పోలీసుల మధ్య సమన్వయ లేమి కూడా నేరగాళ్లకు కలిసి వస్తోంది. స్టేషన్లలో సీసీ కెమెరాలను పెంచాలని జీఆర్పీ అధికారులు చాలాకాలంగా ఆర్పీఎఫ్ను కోరుతున్నారు. రైల్వే ట్రాక్‌లకు రెండు వైపులా ఫెన్సింగ్ లేనందున తరచూ ఆత్మహత్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని పలు సమీక్షల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ‘‘ ఇలాంటి భద్రతా పరమైన అంశాల్లో పరస్పర సహకార లోపం సరైంది కాదు. ఇది లక్షలాది మంది ప్రయాణికులు, ప్రజల రక్షణకు సంబంధించిన అంశం. రైల్వే అధికారులు సైతం ఇలాంటి అంశాలపైన సీరియస్‌గా దృష్టి సారించాలి..’’ అని ఒక పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. నేరాల్లో ముఖ్యమైనవి..⇔ గత నవంబర్ 11న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రేణుక అనే చిన్నారి అపహరణకు గురైంది. ఇప్ప టి వరకు ఆచూకీ లభించలేదు.⇔ చత్తీస్‌గఢ్‌కు చెందిన సుమన్‌పాండే(8) రెండేళ్ల క్రితం నాంపల్లి రైల్వేస్టేషన్లో అపహరణకు గురయ్యాడు.⇔ మెహదీపట్నంకు చెందిన యువతి(16) మూడేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అదృశ్యమైంది.⇔ బీహార్‌కు చెందిన జగదీశ్ పాశ్వాన్(16) సైతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కనిపించకుండా పోయాడు. నిజామాబాద్ జిల్లా జుక్కల్‌కు చెందిన బాలాజీ, నగరానికి చెందిన బన్నీ, మహబూబ్‌నగర్ కు చెందిన ⇔ రాజు (11) వంటి రైల్వేస్టేషన్లలోనే ఉన్నపళంగా మాయమయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రైల్వేపోలీసులు 25 మిస్సింగ్ కేసులు నమోదు చేశారు. రికార్డుల్లో నమోదు కాని వారు పదుల సంఖ్యలోనే ఉండవచ్చునని అధికారుల అంచనా.