బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ మ్యాక్‌కనెల్స్‌కు ఇప్పుడు 30 ఏళ్లు. కొన్ని నెలల క్రితమే ఆయన పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఇంతకు ఫ్రెడ్డీ ఆడ, మగా ! అని అనుమానం రావచ్చు. పుట‍్టుకతో ఆడ అయినా లింగ మార్పిడి ద్వారా ఐదేళ్ల క్రితమే మగగా మారిపోయారు. అయితే గర్భాశయాన్ని తొలగించుకోలేదు. బిడ్డను కనడం కోసం అలాగే ఉంచుకున్నారు. ఓ దాత వీర్యంతో ఎంచక్కా తల్లీ–తండ్రీ అయ్యారు. ఇంతకు ఆయన్ని ఆ బిడ్డకు తండ్రని పిలవాలా ? తల్లని పిలవాలా ? ఇది తేల్చుకోవడానికే ఆయన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. తన బిడ్డ పేరును రిజిస్టర్ చేయడానికి ఆయన ఇటీవల ‘ది జనరల్ రిజిస్టర్’ ఆఫీసుకు వెళ్లారు. తండ్రిగా తన పేరును చేర్చుకోవాలని ఆయన అక్కడి అధికారులను కోరారు. అక్కడి అధికారులు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ‘నీ కడుపు చించుకు పుట్టిన బిడ్డ కనుక, ముమ్మాటికి నీవు తల్లివే’ అంటూ వారు వాదించారు. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!
Jul 18 2019 4:07 PM | Updated on Jul 18 2019 4:34 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement