నా నోటికి చిక్కిన దేన్ని వదలను | Alligator Smashes Watermelon In A Single Bite Viral Video | Sakshi
Sakshi News home page

నా నోటికి చిక్కిన దేన్ని వదలను

Aug 14 2019 6:16 PM | Updated on Aug 14 2019 6:19 PM

అనుకోకుండా మొసలి నోటికి ఏదైనా చిక్కితే వదలదు. అలాంటిది కావాలనే మొసలి నోట్లోకి విసిరితే ఇక అది వదులుతుందా. అస్సలు వదలదు. ఇలాంటి దృశ్యమే ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఓ మొసలి తన దవడలతో ఒక్క దెబ్బతో పుచ్చకాయను అమాంతం రెండు ముక్కలు చేసింది. ఈ విడియోను గత గురువారం ఫ్లోరిడాకు చెందిన సెయింట్‌ ఆగస్టిన్‌ ఎలిగేటర్‌ ఫార్మ్‌ జులాజికల్‌ పార్క్‌ షేర్‌ చేసింది. ఇందులో ఓ వ్యక్తి పుచ్చకాయను నేరుగా మొసలి నోట్లోకి విసరగా, వెంటనే మొసలి దాన్ని అందుకొని తన పదునైన దవడలతో  రెండు ముక్కలుగా చేసింది. వీడియో షేర్‌ చేసిన క్షణాల్లోనే  కొన్ని వేలమంది నెటజన్లు చూడగా ‘అయ్యో! నేను(మొసలి) శాఖాహారిని కాదు‘, ‘ నా నోటికి అందిన దేనని వదలను’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement