గాంధీ ఈ రెండక్షరాల పేరు వినగానే.. నడుముకు కొల్లాయి, చేతిలో కర్ర, బోసి నవ్వుతో ఓ బక్కపల్చని ఆకారం మన కళ్ల ముందు కనిపిస్తుంది. రవి అస్తమించన బ్రిటీష్ సామ్రాజ్యపు అధికారికానికి చరమగీతం పాడించిన వ్యక్తి ఇతనే అంటే నమ్మడం కష్టం. కానీ అహింస, శాంతిని ఆయుధాలుగా చేసుకున్న వ్యక్తి దేన్నైనా సాధిస్తాడు అనడానికి ఉదాహరణగా నిలిచారు గాంధీ. ఆ మహాత్ముడి పేరు వాడుకుని ఓ కుటుంబం మనదేశంలో ఏళ్లకేళ్లుగా అధికారం దక్కించుకుందంటేనే ఆ పేరుకు ఉన్న శక్తి, ఆకర్షణ, గౌరవం ఏలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దేశాన్ని బ్రిటీష్ సామ్రాజ్యపు కబంద హస్తాల నుంచి విడిపించి.. స్వేచ్ఛ వాయువులు పీల్చేలా చేసిన బాపును రాజకీయ నాయకులు అధికారం కోసం వాడుకుంటుంటే.. అల్పులు మిడిమిడి జ్ఞానంతో దేశ విభజనకు కారకుడంటూ తెలివితక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. గాంధీ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటి ఈ అల్పుల కళ్లు తెరిపించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి ప్రసంగానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
గాంధీ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటిన విద్యార్థి
Sep 19 2019 6:49 PM | Updated on Sep 19 2019 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement