రాజదంపతుల కొత్త జీవితం! | Prince Harry, Meghan Markle Start New Life in Canada | Sakshi
Sakshi News home page

రాజదంపతుల కొత్త జీవితం!

Jan 21 2020 5:08 PM | Updated on Jan 21 2020 5:12 PM

భుజానేసుకున్న జోలిలో సంటోడు, కుడి వైపున నల్లటి లాబ్రడార్‌ పెంపుడు కుక్క ఓజ్, ఎడమ పక్క మరో జాతికి చెందిన పెంపుడు కుక్క బీగల్‌ గై వెంట నడుస్తుండగా, వెన్నంటి బ్రిటన్‌ రాజ రక్షకులు తోడుగా, ముఖాన చెరగని చిరునవ్వుతో మేఘన్‌ మార్కెల్‌ రీజనల్‌ పార్క్‌లో సామాన్యుల లోకంలోకి ప్రయాణం. ఆమె బ్రిటన్‌ రాచరికపు వ్యవస్థకు శాశ్వతంగా తిలోదకాలిచ్చి సోమవారం ఉదయమే కెనడా, వాంకోవర్‌ దీవిలోని రీజనల్‌ పార్క్‌లోకి అడుగుపెట్టారు. అక్కడికి సమీపంలో ఉన్న దాదాపు 99 కోట్ల రూపాయల విలువైన భవంతి వరకు మాత్రమే బ్రిటన్‌ రాజ రక్షకులు ఆఖరి సారిగా వెంట వచ్చారు. ఆమెను సురక్షితంగా భవంతి వద్ద దింపి ఆమె నుంచి శాశ్వతంగా సెలవు తీసుకొకి వెళ్లిపోయారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement