శోభాయమానంగా డాలస్‌ బతుకమ్మ వేడుకలు | TPAD Hold Bathukamma And Dussehra Celebrations At Dallas | Sakshi
Sakshi News home page

శోభాయమానంగా డాలస్‌ బతుకమ్మ వేడుకలు

Oct 9 2019 8:59 PM | Updated on Mar 21 2024 11:35 AM

 తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌‌) ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలెన్‌ ఈవెంట్‌ సెంటర్‌, ఆలెన్‌, టెక్సాస్‌లో నిర్వహించిన ఈ సంబరాల్లో మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు.  జానకి రామ్‌ మందాడి ఫౌండేషన్‌ కమిటీ చైర్‌, పవన్‌ గంగాధర బోర్ట్‌ఆప్‌ ట్రస్టీ చైర్‌ చంద్రారెడ్డి, పోలీస్‌ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ కలసాని, ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ కోఆర్డినేటర్‌ మాధవి సుంకిరెడ్డి, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ వైఎస్‌ చైర్‌ రవికాంత్‌ మామిడి, వైఎస్‌ ప్రెసిడెంట్‌ మాధవి లోకిరెడ్డి, జనరల్‌ సెక్రటరీ అనురాధ మేకల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కనీ, వినీ ఎరుగని రీతిలో ఈ వేడుకలు జరిగాయి.  పొటెత్తిన జనసందోహాన్ని కట్టడి చేయలేక ఆలెన్‌ ఈవెంట్‌ సెక్యూరిటీ యాజమాన్యం సైతం కొంతమందిని వెలుపలే నిలిపివేసింది. ఈ సంబరాల్లో ప్రముఖ మాటల రచయిత కోనా వెంకట్‌, సినీ నటి అనూ ఇమ్మాన్యుయేల్‌ ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement