ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలనే కార్మికులు ఇవాళ అడుగుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని, అందుకే ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయడం అంటే అమ్మడం అన్నట్లే. ఆర్టీసీ ఒకరోజుతో నిర్మించింది కాదు.. దశాబ్దాల ఆస్తులు. ఆర్టీసీపై ఏ నిర్ణయమైనా చట్ట సభల్లో చర్చలు జరిపి తీస్కోవాలి.