మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అకాల మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. పులివెందుల్లోని వైఎస్ వివేకానంద రెడ్డి నివాసంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. అసలేం జరిగింది? బెడ్ రూమ్‌లో ఏసీ ఉన్నప్పటికీ డోర్ ఎందుకు ఓపెన్ చేసి ఉంది? సైడ్ డోర్ లాక్ ఎవరు తీశారు? అనే కోణాలు విచారణ జరపుతూ వివరాలు సేకరిస్తున్నారు.