వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి ఈరోజు మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి వచ్చిన ఆయన.. 1.49 గంటలకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు ఆయన సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.