రూపాయికే చీర.. యజమానికి షాక్‌!

సాక్షి, తూర్పుగోదావరి: కొత్త సంవత్సరంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రకటించిన బంపర్‌ ఆఫర్‌ ఓ షాపు యజమానికి తలనొప్పిగా మారింది. చేతికందిన చీరలను ఎవరికి వారు పట్టుకోవడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అమలాపురం గ్రాండ్‌లో ఒక రూపాయికే ఒక చీర ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. దీంతో చీరలను సొంతం చేసుకునేందుకు అధిక సంఖ్యలో మహిళలు బారులు తీరారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా షాపులోకి ప్రవేశించి చీరలను పట్టుకుపోయారు. ఈ పరిణామంతో కంగుతిన్న షాపు యజమాని పోలీసుల దగ్గరికి పరిగెత్తుకువెళ్లాడు. 
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top