కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో కీలక పరీక్షలుగా పేరొందిన నీట్, జేఈఈ, యూజీసీ నెట్, సీమ్యాట్‌లను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ప్రకటించారు. విద్యారంగంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ద్వారా పలు సంస్కరణలు తీసుకొస్తామని గతంలోనే కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.