రాష్ట్రం కోసం పనిచేసే తపన ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని భావించినందు వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం ఆయన విలేరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే వైఎస్ జగన్‌ను కలిసినట్లు వెల్లడించారు. పూటకో మాట మార్చే చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.