సికింద్రాబాద్ సమీపంలోని అల్వాల్‌లో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. కారుకు అడ్డువచ్చాడని ఓ బాలుడిని క్రాంతి స్వరూప్ అనే వ్యక్తి తీవ్రంగా కొట్టాడు. బాలుడు బోరున విలపించినా కనికరం చూపకుండా దారుణంగా వ్యవహరించాడు. లిఫ్ట్‌లోకి తీసుకెళ్లి విక్షణారహితంగా బాదాడు. ఈ ఘటన అల్వాలోని సువర్ణ అపార్ట్‌మెంట్‌లో సోమవారం జరిగింది. శాంతి స్వరూప్ దుర్మార్గమంతా అపార్టమెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తీవ్ర గాయాల పాలైన బాలుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్వరూప్‌పై బాలుడి తండ్రి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కారుకు అడ్డం వచ్చాడంటూ..
Nov 11 2019 10:39 AM | Updated on Nov 11 2019 4:07 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement