యువతిపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ ‘గజల్’ శ్రీనివాస్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కొంతకాలంగా శ్రీనివాస్ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు చర్యలకు ఉపక్రమించినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.