హామీల సాధనకై హస్తిన పయనం
రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని, వీటికి ఉదారంగా ఆర్థిక సాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి కోరనున్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి పోయిందని, భారీగా బిల్లుల బకాయిలను కూడా వదిలిపెట్టిందని, ఈ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని విన్నవించనున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి