ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్ వాళ్లే లబ్ధి పొందుతున్నారని, కానీ వారి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీని సింగపూర్ కంపెనీలకు దోచిపెడుతున్నాడని ఆరోపించారు. గత నాలుగేళ్లలో ఆరు పర్యాయాలు సింగపూర్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని బుగ్గన ప్రశ్నించారు.