ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీం కీలక తీర్పు | Sakshi
Sakshi News home page

ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీం కీలక తీర్పు

Published Wed, Sep 26 2018 12:54 PM

ఆధార్‌ చట్టబద్ధతపై అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఆధార్‌ స్కీమ్‌ రాజ్యాంగపరంగా చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆధార్‌ ఫార్ములాతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఆధార్‌పై తొలి తీర్పును జస్టిస్‌ ఏకే  సిక్రీ, చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ చదివి వినిపించారు. మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే, ఆధార్‌ ఎంతో విశిష్టమైనదని జడ్జీలు పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల కోసమే ఆధార్‌ సేవలను తీసుకొచ్చారని, డూప్లికేట్‌ ఆధార్‌ తీసుకోవడం అసాధ్యమని తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆధార్‌ ఒక గుర్తింపని చెప్పారు

Advertisement

తప్పక చదవండి

Advertisement