మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల కడుపు నింపేందుకు నాణ్యత కలిగిన సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని ఓపక్క కూటమి ప్రభుత్వం ప్రచారంలో హోరెత్తిస్తుంటే మరోపక్క పురుగులు, ముక్కిపోయిన బియ్యం పాఠశాలలకు చేరుతుండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలకు రావాల్సిన సన్న బియ్యాన్ని మాయం చేసి అవే సంచుల్లో పురుగులతో కూడిన కోటా బియ్యాన్ని నింపి పంపుతున్నారనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం, పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హైస్కూల్ ప్లస్ కళాశాలలో జరిగిన ఘటన దీనికి అద్దం పడుతోంది.
AP: సన్న బియ్యం స్థానంలో పురుగుల బియ్యం
Sep 11 2025 8:05 PM | Updated on Sep 11 2025 8:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement