వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదని సీఎం వైయస్ జగన్ వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులకు అత్యంత ఖరీదైన అత్యాధునిక పరికరాలను అందించారు. ఫలితంగా క్లిష్టతరమైన కీళ్లమార్పిడి ఆపరేషన్లను కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్నారు.