వరుస సిరీస్ విజయాలతో మాజీ కెప్టెన్ల రికార్డులను నీళ్లప్రాయంలా తిరగరాస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. నాలుగు వరుస టెస్ట్ సిరీస్ లలో డబులు సెంచరీలు సాధించి అరుదైన రికార్డును ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టులో తన ఖాతాలో వేసుకున్నాడు. డాన్ బ్రాడ్ మన్, రాహుల్ ద్రవిడ్ ల రికార్డును సవరించడంపై కోహ్లీ సోషల్ మీడియాలో స్పందించాడు. తన ఎదుగుదలకు, సక్సెస్ వెనక ఉన్న సీక్రెట్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా శనివారం వెల్లడించాడు.