టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వివాదస్పద ప్రకటన కేసులో అతడిపై అనంతపురం కోర్టు చేపట్టిన విచారణపై స్టే విధించింది. ఈ కేసు విచారణను అనంతపురం నుంచి బెంగళూరు కోర్టుకు తరలించాలని ధోని పెట్టుకున్న విజ్ఞాపనపై అభిప్రాయం తెలపాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్టు కోరింది.