త్వరలో దక్షిణాఫ్రికాతో సుదీర్ఘమైన క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో 72 రోజుల పర్యటనను దృష్టిలో పెట్టుకుని బూట్ క్యాంప్ (కఠోర శిక్షణ)ను నిర్వహించడానికి బీసీసీఐ సన్నద్ధమైంది. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి సలహా మేరకు అతని నేతృత్వంలో రెండు రోజుల పాటు ధర్మశాలలో బూట్ క్యాంప్ ను నిర్వహించనున్నారు. సముద్ర మట్టానికి ఏడు వేల అడుగుల ఎత్తులో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ బూట్ క్యాంప్ లో ఆర్మీ తరహాలో ట్రెక్కింగ్ తో పాటు దూకడం, పాకడం తదితర వ్యాయమాలను ఆటగాళ్లతో చేయిస్తారు. బూట్ క్యాంప్ లో భాగంగా టీమిండియా ఆటగాళ్లు సోమవారం హిమాచల్ ప్రదేశ్ కు చేరుకుంటారని ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెస్ సెక్రటరీ మోహిత్ సూద్ స్పష్టం చేశారు.
Sep 28 2015 4:59 PM | Updated on Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement