న్యాయం కోసం కోర్టుకు వస్తే టీడీపీ కార్యకర్తలతో రౌడీయిజం చేయిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడికి తిరగాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి వీసా తీసుకోవాలా అని ఆమె శుక్రవారమిక్కడ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని డీజీపీ, తదితర పోలీసు అధికారులపై దాఖలు చేసిన ప్రైవేటు కేసు విచారణ నిమిత్తం ఎమ్మెల్యే రోజా ఇవాళ కృష్ణాజిల్లా గన్నవరం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని మండిపడ్డారు.